BREAKING
ఘనంగా విద్యాసంస్థల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు నారాయణపేట డిసిసి అధ్యక్షులను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి పశ్చిమ బెంగాల్ ఉపఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయం తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుంటానా? స్పందించిన ది రాజాసాబ్ హీరోయిన్ నిధి అగర్వాల్ సైబర్ మోసాలకు కేంద్రం చెక్ :కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి! నకరికల్లులో వైసీపీ కార్యకర్తలకు ఐడి కార్డులు పంపిణీ ఆర్టీసీ ఎన్నికల్లో దూసుకుపోయిన బాణం నారాయణపేట డిపోలో కూటమికి మెజార్టీ రాత్రిపూట ఎలాంటి ఆహారం తీసుకోవాలి? జీర్ణక్రియ సజావుగా సాగేలా పాటించాల్సిన ఆరోగ్యకరమైన చిట్కాలు హోప్ శతకం, రూథర్‌ఫోర్డ్ విధ్వంసం – 249 పరుగులు చేసినా భారత్‌కు తప్పని ఓటమి మానసిక ప్రశాంతత కోసం రోజువారీ జీవితంలో పాటించాల్సిన సులువైన మార్పులు ఇవే నిగనిగలాడే అందమైన చర్మం కోసం ఆహారపు అలవాట్లు మరియు నిద్ర విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారా? ఈ ప్రమాదకర అలవాటు వల్ల కలిగే అనర్థాలు ఇవే సాధారణ ర్యాలీలకు తెర.. ఫలితాల ఆధారంగానే భారత మార్కెట్లలో అవకాశాలు.. రజనీకాంత్ జైలర్ 2 కోసం క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా వేసుకున్న నెల్సన్.. అసలు నిజం బయటపెట్టిన సూపర్ స్టార్ బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్: రోజువారీ సీఆర్‌ఆర్ నిర్వహణ నిబంధన 99 శాతానికి పెంపు.. అక్టోబర్ 16 నుంచే అమలు!

పీఎం సూర్య సూర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

Select Suryaa Now
పీఎం సూర్య సూర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం

 ప్రకృతి వనరులను సంరక్షించడంతోపాటు విద్యుత్ ఖర్చులను తగ్గించుకునేందుకు సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రజలు ప్రోత్సహించాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కోరారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకొని పందలపాక ఎన్టీఆర్ కాలనీని సౌర విద్యుత్ వినియోగంలో మోడల్ కాలనీగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.సేవాసేతు కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా ఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో పందలపాక ఎన్టీఆర్ కాలనీలో నిర్వహించిన పీఎం సూర్యఘర్ పథకంపై అవగాహన సదస్సులో ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ సందర్భంగా సబ్సిడీ ద్వారా అందించే సోలార్ ప్యానళ్ల ప్రదర్శనను రాజమహేంద్రవరం ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి ప్రారంభించారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2024లో ప్రారంభించిన పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం ద్వారా గృహ వినియోగదారులను సౌర విద్యుత్ వైపు ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతి ఇంటిపై సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేసుకొని విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడం ద్వారా సంప్రదాయ విద్యుత్ వనరులపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చని వివరించారు.బొగ్గు, గ్యాస్ వంటి ఇంధనాలను ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల పర్యావరణంపై ప్రభావం పడుతోందని, సౌరశక్తి వంటి పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడవచ్చని పేర్కొన్నారు. ప్రతి కుటుంబం సౌర విద్యుత్ వినియోగంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద అర్హులైన గృహ వినియోగదారులకు సబ్సిడీ అందిస్తోందని, పథకం నిబంధనలను తెలుసుకొని అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. సౌర విద్యుత్ ఉత్పత్తి వల్ల గృహాల విద్యుత్ బిల్లుల భారం తగ్గడంతోపాటు విద్యుత్ వ్యవస్థపై ఒత్తిడి తగ్గుతుందని వివరించారు. ప్రకృతిని కాపాడుకోవడం కూడా దేశానికి సేవ చేయడమేనని అన్నారు. పందలపాక ఎన్టీఆర్ కాలనీ అభివృద్ధి గురించి ఎమ్మెల్యే వివరిస్తూ, సుమారు 16 ఎకరాల విస్తీర్ణంలో కాలనీని అభివృద్ధి చేసినట్లు తెలిపారు. తన తండ్రి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి హయాంలో కేశవస్వామి ఆలయానికి సంబంధించిన భూమిని సేకరించి, నివాసాలకు అనువుగా మెరక చేయడం జరిగిందని పేర్కొన్నారు.తదుపరి వివిధ దశల్లో ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణాలు ప్రారంభమయ్యాయని వివరించారు. ఇటీవల గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్‌లుగా పనిచేసిన చిన్న బుజ్జి, పద్మావతి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ నుంచి రూ.కోటి నిధులతో రహదారి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా మూడు విడతల్లో రూ.2 కోట్ల నిధులతో రహదారుల నిర్మాణం చేపట్టినట్లు వెల్లడించారు.ప్రస్తుతం కాలనీలో ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయని, మౌలిక సదుపాయాలు మెరుగుపడుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో కాలనీలోని ప్రతి కుటుంబం పీఎం సూర్యఘర్ పథకాన్ని వినియోగించుకునేందుకు ముందుకు రావాలని కోరారు. ఎక్కువ మంది సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటే ఎన్టీఆర్ కాలనీని ఆదర్శ కాలనీగా అభివృద్ధి చేయవచ్చని అన్నారు. ప్రజలకు పథకంపై అవగాహన కల్పించేందుకు ఈపీడీసీఎల్ అధికారులు ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సబ్సిడీ వివరాలు, అర్హతలు, దరఖాస్తు విధానం తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమాన్ని నిర్వహించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు, ఈపీడీసీఎల్ అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.