BREAKING
తూప్రాన్ లో విద్యుత్ కోతులను నిరసిస్తూ ఆందోళన క్షయ వ్యాధి రహిత భారత్‌ లక్ష్యంగా ‘జోష్’ టీముల ఏర్పాటు చిన్నారుల ఆరోగ్యానికి పౌష్టికాహారం ఎంతో ముఖ్యం తూప్రాన్ విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజా బాట టీబీ ముక్త భారత్‌ అభియాన్‌లో జోష్ టీమ్‌ ప్రారంభం ఎన్టీఆర్ కాలనీ అభివృద్ధికి 7 కోట్లు నిధులు వెట్టిచాకిరీ నిర్మూలనకు ‘స్వేచ్ఛా రథం’ పౌష్టికాహారం తోనే సంపూర్ణ ఆరోగ్యం పోషణ మాసోత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా జ్యోతి నగర్ అంగన్వాడి కేంద్రంలో ముగిసిన 9వ రాష్ట్రీయ పోషణ మాసోత్సవాలు నీటి కోసం పాట్లు..!అర కిలోమీటర్ విద్యార్ధినుల నడక..! శనీశ్వర స్వామి వారి దర్శించుకున్న మెప్ప డైరెక్టర్ గ్రామీణ కళాకారులను ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలి దసరా పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి టీబీ నిర్మూలనకు... జోష్ టీమ్ శ్రీకారం

పీఎం సూర్య ఘర్ పథకం పనులను వేగవంతం చేయాలి* - *: ప్రజలు ప్రభుత్వ సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలి : ఎస్‌ఈ శేషాద్రి శేఖర్

Select Suryaa Now
పీఎం సూర్య ఘర్ పథకం పనులను వేగవంతం చేయాలి*  - *: ప్రజలు ప్రభుత్వ సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలి : ఎస్‌ఈ శేషాద్రి శేఖర్

అనంతపురం బ్యూరో : ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రయోజనం అందేలా పనులను వేగవంతం చేయాలని అనంతపురం ఆపరేషన్ సర్కిల్ ఎస్‌ఈ శేషాద్రి శేఖర్ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేందుకు అక్టోబర్ 7 నుంచి 9వ తేదీ వరకు పీఎం సూర్య ఘర్ సేవా సేతు అభియాన్ శిబిరాలను నిర్వహించారు. ప్రతి సబ్ డివిజన్‌లో ప్రత్యేక PMSG స్టాల్/కియోస్క్ ఏర్పాటు చేసి, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, కౌన్సెలింగ్/గ్రీవెన్స్, ఎంపానెల్డ్ వెండర్లు, బ్యాంకర్ల కోసం ప్రత్యేక డెస్క్‌లను ఏర్పాటు చేశారు.

- ఈ సందర్భంగా APSPDCL అధికారులు, బ్యాంకర్లు, ఎంపానెల్డ్ వెండర్లు, వినియోగదారులు మరియు పథకం లబ్ధిదారులతో పరస్పర చర్చలు నిర్వహించి, పథకం ప్రయోజనాలు, సబ్సిడీ, దరఖాస్తు విధానం, రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఇప్పటికే సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకుని ప్రయోజనం పొందుతున్న లబ్ధిదారులతో వారి అనుభవాలను పంచుకునేలా కార్యక్రమాలు నిర్వహించారు.

- ప్రజలు ప్రభుత్వ సబ్సిడీని సద్వినియోగం చేసుకుని తమ ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని ఎస్‌ఈ సూచించారు. సౌర విద్యుత్ వినియోగంతో విద్యుత్ బిల్లుల భారం తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని తెలిపారు.

- ఈ కార్యక్రమంలో డీఈలు రమేష్, రవిశంకర్ (MRT), రాజేష్ (విజిలెన్స్), శ్రీకాంత్ రెడ్డి (కన్‌స్ట్రక్షన్), విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది, బ్యాంకర్లు, వెండర్లు, వినియోగదారులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.

 

రిపోర్టర్ మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.