పెద్దూరు స్వర్ణ గ్రామ సచివాలయంకు కొత్త నేమ్ బోర్డు ఏర్పాటు
గరుగుబిల్లి, సూర్య : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పరిపాలనా సంస్కరణల్లో భాగంగా సచివాలయాల రూపురేఖలు మార్చేందుకు గ్రామ సచివాలయాల పేర్లను స్వర్ణ గ్రామ సచివాలయముగా మారుస్తూ ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసింది.ఈనేపథ్యంలో క్షేత్ర స్థాయిలో ఉన్న అన్ని స్వర్ణ గ్రామ సచివాలయ భవనాలపై పాత బోర్డులను తొలగించి,సరికొత్త డిజైన్‌తో కూడిన నేమ్ బోర్డులను ఏర్పాటు చేసేందుకు తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని మండల స్వర్ణ గ్రామ సచివాలయాల డిప్యూటీ ఎంపీడీవో మరడాన వెంకటేశ్వరరావు వెల్లడించా రు.మండల పరిధిలోని పెద్దూరు స్వర్ణ గ్రామ సచివాలయంకు నూతన బోర్డు ఏర్పాటును డిప్యూటీ ఎంపీడీవో మరడాన వెంకటేశ్వరరావు మంగళ వారం పరిశీలించారు.నూతనంగా ఏర్పాటు చేయబోయే బోర్డులలో పారదర్శకత, ఆధునికతకు ప్రాధాన్యం ఇచ్చారు. మండల పరిధిలోని ఆయా గ్రామాల్లోని స్వర్ణ గ్రామ సచివాలయా లకు తక్షణమే బోర్డులను ఏర్పాటు చేయాలని డిప్యూటీ ఎంపీడీవో వెంకటేశ్వరరావు తెలిపారు.అదే విధంగా గ్రామం పేరుతో పాటు, స్పష్టంగా మండలం మరియు జిల్లా వివరాలు కనిపించేలా బోర్డును రూపొందించాలన్నారు. ఈ మార్పు ద్వారా ప్రభుత్వ సేవల వికేంద్రీకరణను మరింత సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా, గ్రామాల్లో సరికొత్త ప్రగతి శోభను తీసుకురావా లని పేర్కొన్నారు.
రిపోర్టర్ : శశి భూషణరావు, గరుగుబిల్లి, పార్వతిపురం మన్యం.