BREAKING
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్: రోజువారీ సీఆర్‌ఆర్ నిర్వహణ నిబంధన 99 శాతానికి పెంపు.. అక్టోబర్ 16 నుంచే అమలు! భారత్ గుండెల్లో ఆఫ్రికా: విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టీకరణ! ఘనంగా ఫ్యూచర్ సిటీ రియల్ ఎస్టేట్ మండల అధ్యక్షుడి జన్మదిన వేడుకలు రోజంతా సరిపడా నీళ్లు తాగకపోతే శరీరంలో జరిగే అనర్థాలు ఇవే.. డీహైడ్రేషన్ లక్షణాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న రియల్ స్టోరీ క్రైమ్ థ్రిల్లర్.. వీకెండ్‌లో చూసేందుకు అద్భుతమైన మూవీ కొప్పర్రులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలి - సిపిఎం వట్టిప్రోలు రంగారావు ను సత్కరించిన...... వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షులు షేక్ నాజర్ లీజుకు తీసుకున్న బస్సులు అమ్ముకున్నారని ఆరోపణ.. బాధితులకు న్యాయం చేయాలి అంటున్న నల్లి రాజేష్.* అగ్ర హీరోలందరితో స్క్రీన్ షేర్.. కానీ మెగాస్టార్ చిరంజీవితో మాత్రం నటించని స్టార్ హీరోయిన్ కార్మికుల కొరత పరిష్కారానికి లావోస్ తీవ్ర కసరత్తు: స్వర్ణాంధ్ర కాలేజి ని సందర్శించిన నాక్ ఈసీ కమిటీ చైర్మన్ ఆచార్య నాగేశ్వరరావు రూ. 8 కోట్ల రెమ్యునరేషన్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన శ్రీనిధి శెట్టి.. ఏమన్నారంటే? ఉత్తర కొరియా ముప్పుపై దక్షిణ కొరియా, జపాన్ రక్షణ శాఖల కీలక భేటీ: రూ.248 కోట్లతో నర్సీపట్నం మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి! రూ.3 కోట్లతో వాకింగ్ ట్రాక్, కళ్యాణ మండపం పనులకు శ్రీకారం : స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇథియోపియా నేషనల్ ప్యాలెస్, మ్యూజియంను సందర్శించిన విదేశాంగ మంత్రి జైశంకర్

పేదలకు కొండంత అండగా కూటమి ప్రభుత్వం

Select Suryaa Now
పేదలకు కొండంత అండగా కూటమి ప్రభుత్వం

పర్చూరు: పేద, మధ్యతరగతి కుటుంబాల అత్యవసర వైద్య ఖర్చుల్లో అండగా నిలుస్తూ కూటమి ప్రభుత్వం పెద్దకొడుకు పాత్ర పోషిస్తోందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. గత రెండేళ్లలో పర్చూరు నియోజకవర్గానికి ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌) ద్వారా రూ.22.20 కోట్లకు పైగా సాయం అందించినట్లు తెలిపారు. పర్చూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ భారీగా వైద్య ఖర్చులు చేసిన పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్‌ ఎంతో భరోసా కల్పిస్తోందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేద కుటుంబాలను పెద్దకొడుకులా ఆదుకుంటున్నారని పేర్కొన్నారు.

గురువారం నిర్వహించిన కార్యక్రమంలో 135 మంది లబ్ధిదారులకు రూ.67.28 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేసినట్లు ఏలూరి తెలిపారు. నియోజకవర్గంలోని ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.

మంత్రులకు ఘన స్వాగతం: పర్చూరు నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు క్యాంపు కార్యాలయానికి వచ్చిన రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనితకు ఎమ్మెల్యే ఏలూరి స్వాగతం పలికారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్‌తో పాటు మంత్రులకు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు, పార్టీ శ్రేణులు అండగా నిలవాలని కోరారు. మంత్రులకు ప్రజలు ఘనంగా ఆశీర్వాదాలు అందించాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విజ్ఞప్తి చేశారు.