BREAKING
విజయవాడ ఉత్సవ్ 2.0, దసరా వేడుకలకు కేంద్ర రైల్వే మంత్రికి ఆహ్వానం బ్రస్సెల్స్ విమానాశ్రయంలో శుక్రవారం విమానాల రద్దుకు ఏర్పాట్లు ఆర్టీసీ బస్సు–టాటా మ్యాజిక్ ఢీ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు: సీఎం చంద్రబాబుకు ఆహ్వానం పలికిన ఆలయ ధర్మకర్తల మండలి, అధికారులు! పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లె పల్లెలో ప్రజాపాలనపరివేద గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ పనీర్ vs సోయా చంక్స్.. బరువు తగ్గాలనుకునేవారికి ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరమో తెలుసా? విజయ మహిళా మండలికి స్వచ్ఛత ఆంధ్ర అవార్డు మానవత్వం చాటుకున్న శాలపాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కవ్వాల్ అడవుల్లో విద్యార్థుల సందడి భారతీయ జ్ఞాన సంపదపై అవగాహన కార్యక్రమాలు రైతులకు రాయితీపై అందుబాటులో శనగ విత్తనాలు బాక్సాఫీస్ వద్ద దృశ్యం 3 సునామీ.. ఐదో రోజుకే 220 కోట్ల మార్క్ దాటేసిన అజయ్ దేవగన్ చిత్రం! ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలి. : రంగారెడ్డి డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి

పేదల సేవకే ప్రాధాన్యత... నెల్లూరు అభివృద్ధియే లక్ష్యం: పొంగూరు షరిణి

Select Suryaa Now
పేదల సేవకే ప్రాధాన్యత... నెల్లూరు అభివృద్ధియే లక్ష్యం: పొంగూరు షరిణి

నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్   :  రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ  సేవా దృక్పథం, అభివృద్ధి సంకల్పంలో భాగంగా నెల్లూరు నగరంలోని 50వ డివిజన్ బుజ్జమ్మరేవు దోబీఖానా ఘట్ వద్ద మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన కుమార్తె పొంగూరు షరిణి పాల్గొన్నారు..ఈ సందర్భంగా స్థానిక, మహిళా నేతలు ఆమెకు గజమాలతో ఘన స్వాగతం పలకగా, ఇటీవల పర్యటనలో రజకులు కోరిన విధంగా 1 లక్ష సొంత నిధులతో 50 మంది రజక సోదరులకు ఉచితంగా ఐరన్ బాక్సులను పంపిణీ చేయడంతో పాటు దోబీఖానా మున్సిపాలిటీ పనులను వేగవంతం చేస్తున్నామని ప్రకటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ నాన్నగారు పేద కుటుంబాలు సొంత కాళ్లపై నిలబడాలనే విద్యకు, స్వయం ఉపాధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, గతంలో వీధి వ్యాపారులకు తోపుడు బండ్లు, వికలాంగులకు ట్రై-సైకిళ్లు అందించినట్లే ఈ సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేస్తూ, ఇప్పటికే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నెల్లూరులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, నెల్లూరు నగరాన్ని దేశంలోనే ఒక గొప్ప రోల్ మోడల్ స్మార్ట్ సిటీగా నిలబెట్టడమే నారాయణ గారి ముఖ్య సంకల్పమని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ కప్పిన శ్రీనివాసులు, నగర మహిళా అధ్యక్షురాలు కప్పిర రేవతి,కో-క్లస్టర్ ఖాదర్ బాషా,ప్రెసిడెంట్ సిద్ధయ్య,వైస్ ప్రెసిడెంట్ నరసింహారావు,జనరల్ సెక్రటరీ సూరిశెట్టి మోహన్,యూనిట్ ఇంచార్జీలు మరియు బూత్ కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు.