BREAKING
యువతరానికి స్ఫూర్తి ప్రధాత భగత్ సింగ్ ఇరు వర్గాల గొడవ - నలుగురు రిమాండ్ వ్యాపార రంగంలో కష్టపడి పనిచేస్తే మంచి అభివృద్ధి సాధించవచ్చు విజయవాడ సాంస్కృతిక వైభవానికి ప్రతీక విజయవాడ ఉత్సవ్.. శ్రీశ్రీశ్రీ ప్రాచీన శివరామ క్షేత్ర ఆలయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నరసాపురం–విశాఖ డైలీ ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరించాలి *పరికరాల పంపిణీ జోరు..!* తక్కువ నీటితో దిగుబడి వచ్చే పంటలను సాగు చేయాలి.... జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. సూపర్ ఎల్‌నినో విపత్తులోనూ చీమకుర్తికి తాగునీరు అందించాం:మంత్రి నిమ్మల ‘ఈసీ’పై కాంగ్రెస్ ఫైర్..! ఐసీఎస్ఎస్ఆర్ సీనియర్ ఫెలోషిప్‌కు డా. గోపే ఎంపిక జంగారెడ్డిగూడెం రాప్ తొలగింపుపై రగడ గ్రామాభివృద్ధిలో పంచాయతీ సెక్రటరీలదే కీలక బాధ్యత: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆర్జీలపై అలసత్వం వద్దు నీట్ ర్యాంకర్ కార్తీక్‌కు కరాటం రాంబాబు అభినందనలు

పేదల గుండెకు మరింత ప్రభుత్వ భరోసా

Select Suryaa Now
పేదల గుండెకు మరింత ప్రభుత్వ భరోసా

పేదల గుండెకు మరింత ప్రభుత్వ భరోసా

= త్వరలో కాకినాడలో క్యాథ్‌ ల్యాబ్‌ సేవలు

= తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళంలో కొత్త క్యాథ్‌ల్యాబ్‌లు                                         = గుండె వైద్య పరికరాల కోసం రూ.34 కోట్ల వ్యయo

= మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ వెల్లడి                                                                          సూర్య ఒంగోలు, బ్యూరో :

ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో గుండె సంబంధిత వైద్య సేవలను మరింత విస్తరించి, పేదలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు. గుండె జబ్బులకు వైద్యం కోసం పేదలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అవసరమైన వైద్య సేవలు అందేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా మంత్రి ఈ వివరాలు వెల్లడించారు. గుండె వైద్య నిపుణుల అందుబాటును పెంచేందుకు వైద్య పీజీ కోర్సుల్లో కొత్తగా 16 సీట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి.

ప్రతి ఏటా సెప్టెంబరు 29న ప్రపంచ హృదయ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 2026లో ప్రపంచ హృదయ సమాఖ్య “డోంట్‌ మిస్‌ ఎ బీట్‌” అనే నినాదంతో అవగాహన కల్పిస్తోంది. గుండె జబ్బుల సంకేతాలను గుర్తించడం, గుండెను కాపాడుకోవడం, గుండె ఆరోగ్యంపై చర్యలు తీసుకోవాలని కోరడం ఈ ప్రచారంలోని ప్రధాన సందేశాలు. ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 2 కోట్ల మంది (20 మిలియన్లు) గుండె జబ్బులతో మరణిస్తున్నారు. భారత్‌లో ప్రతి నాలుగు మరణాల్లో ఒకదానికంటే ఎక్కువ మరణాలకు గుండె జబ్బులే కారణమవుతున్నాయి. ఛాతినొప్పిని గ్యాస్‌గా భావించడం, ఆయాసాన్ని వయసు ప్రభావంగా తీసుకోవడం, చెమటలు, నీరసాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రమాద సంకేతాలు గుర్తించకుండా పోతున్నాయి.

త్వరలో కాకినాడలో క్యాథ్‌ల్యాబ్‌

కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఆధునిక క్యాథ్‌ల్యాబ్‌ పనులు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. ఒప్పందం కూడా పూర్తయిందని, అక్టోబర్‌ 1న క్యాథ్‌ల్యాబ్‌ సేవలు ప్రారంభించనున్నామని చెప్పారు.

మూడు చోట్ల కొత్త క్యాథ్‌ల్యాబ్‌లు

తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళం ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో కొత్త క్యాథ్‌ల్యాబ్‌ల ఏర్పాటుకు టెండర్‌ ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి తెలిపారు. వీటి కోసం రూ.18 కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో 8 క్యాథ్‌ల్యాబ్‌లు పనిచేస్తున్నాయని తెలిపారు. వీటిలో 5 ప్రభుత్వ ఆధ్వర్యంలో, 3 ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్య విధానంలో పనిచేస్తున్నాయని మంత్రి  వివరించారు.

హార్ట్‌–లంగ్‌ మెషిన్లకు రూ.10 కోట్లు

తిరుపతి, కడప, అనంతపురం, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రులకు మరో 4 హార్ట్‌–లంగ్‌ మెషిన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఇందుకోసం రూ.10 కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే కర్నూలు, గుంటూరు, విజయవాడలో హార్ట్‌–లంగ్‌ మెషిన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విశాఖ కేజీహెచ్‌లో సామాజిక బాధ్యత నిధులతో హార్ట్‌–లంగ్‌ మెషిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు.

రూ.6 కోట్లతో 2డీ ఎకో, ఇతర పరికరాలు

కర్నూలు, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రులకు అత్యాధునిక 2డీ ఎకో మెషిన్ల కోసం రూ.2 కోట్లు ఖర్చు చేయనున్నామని మంత్రి తెలిపారు. గుండె వైద్యానికి అవసరమైన ఐసీయూ మానిటర్లు, డీఫిబ్రిలేటర్లు, శస్త్రచికిత్సకు అవసరమైన ఇతర పరికరాల కోసం మరో రూ.4 కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. మొత్తంగా రాష్ట్రంలోని ముఖ్య ప్రభుత్వ ఆసుపత్రుల్లో గుండె వైద్య పరికరాలు, మౌలిక వసతులను పెంచేందుకు రూ.34 కోట్ల ప్రణాళిక అమలు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.

అనంతపురంలో త్వరలో ఓపెన్‌ హార్ట్‌ శస్త్రచికిత్సలు

రాయలసీమ ప్రజలు గుండె శస్త్రచికిత్సల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అనంతపురంలో త్వరలో ఓపెన్‌ హార్ట్‌ శస్త్రచికిత్సలు ప్రారంభించనున్నామని మంత్రి తెలిపారు. ఇందుకు అవసరమైన హార్ట్‌–లంగ్‌ మెషిన్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు.

కాకినాడలో ఓ కార్పొరేట్‌ సంస్థ ద్వారా 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో హార్ట్‌ సెంటర్‌ ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు.

రెండేళ్లలో 4.48 లక్షల మందికి గుండె వైద్యం

రాష్ట్రంలోని 10 హార్ట్‌ సెంటర్ల ద్వారా 2024–25, 2025–26 ఆర్థిక సంవత్సరాల్లో 4,48,863 మంది ఓపీ సేవలు పొందారని మంత్రి తెలిపారు. 27,024 మంది ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందారని చెప్పారు. ఈ రెండేళ్లలో 4,724 యాంజియోప్లాస్టీలు, 14,320 యాంజియోగ్రామ్‌లు, 359 బైపాస్‌ శస్త్రచికిత్సలు, 111 గుండె కవాటాల మార్పిడి, ఇతర శస్త్రచికిత్సలు జరిగాయని మంత్రి వివరించారు.

గుంటూరు, విశాఖ, కర్నూలులో విస్తృత సేవలు

2025–26లో గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 53,505 మంది ఓపీకి రాగా, 2,324 మంది ఆసుపత్రిలో చేరారు. 1,538 యాంజియోగ్రామ్‌లు, 78 బైపాస్‌ శస్త్రచికిత్సలు జరిగాయని మంత్రి తెలిపారు.

విశాఖ కేజీహెచ్‌లో 43,783 మంది ఓపీకి రాగా, 2,622 మంది ఆసుపత్రిలో చేరారు. 1,416 యాంజియోగ్రామ్‌లు, 55 బైపాస్‌ శస్త్రచికిత్సలు జరిగాయని చెప్పారు.

కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 26,189 మంది ఓపీకి రాగా, 2,697 మంది ఆసుపత్రిలో చేరారు. 1,021 యాంజియోగ్రామ్‌లు, 63 బైపాస్‌ శస్త్రచికిత్సలు జరిగాయని మంత్రి వివరించారు.

14,500 మందికిపైగా గుండె వైద్య సేవలు

2025–26లో రాష్ట్రంలోని క్యాథ్‌ల్యాబ్‌లలో 10,288 మందికి గుండె వైద్య సేవలు అందించామని మంత్రి తెలిపారు. వీటిలో 3,624 సేవలు ప్రభుత్వ క్యాథ్‌ల్యాబ్‌లలో, 6,664 సేవలు ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్య క్యాథ్‌ల్యాబ్‌లలో అందించామని చెప్పారు.

2026 ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు మరో 4,217 మందికి గుండె వైద్య సేవలు అందించామని తెలిపారు. దీంతో 2025 ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 14,500 మందికిపైగా యాంజియోగ్రామ్‌లు, ఇతర గుండె వైద్య సేవలు పొందారని మంత్రి వివరించారు.

ఎన్టీఆర్‌ వైద్య సేవ ద్వారా రూ.1,767.79 కోట్ల విలువైన ఉచిత వైద్యం….

ప్రభుత్వ ఆసుపత్రుల్లో గుండె వైద్య సేవలను పెంచడంతో పాటు ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్టు ద్వారా కూడా పేదలకు ఉచితంగా గుండె వైద్యం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. కార్డియాలజీ, కార్డియోవాస్కులర్‌ విభాగాల్లో మొత్తం 340 రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలోని అనుబంధ ఆసుపత్రులతో పాటు హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలోని అనుబంధ ఆసుపత్రుల్లోనూ గుండె వైద్యం ఉచితంగా అందుతోందని వివరించారు. 2024 నుంచి ఇప్పటివరకు రూ.1,767.79 కోట్ల విలువైన గుండె వైద్య సేవలను ప్రజలకు ఉచితంగా అందించినట్లు మంత్రి తెలిపారు. 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.323 కోట్ల విలువైన గుండె వైద్య సేవలు అందించినట్లు మంత్రి సత్య కుమార్ చెప్పారు.

50–59 ఏళ్ల వారిలో ఎక్కువ

2025 సెప్టెంబరు నుంచి 2026 ఆగస్టు వరకు 1,41,934 మందికి గుండె వైద్యం కోసం ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్టు ఆమోదం తెలిపిందని మంత్రి తెలిపారు. వారిలో 40–49 ఏళ్ల వారు 18.49 శాతం, 50–59 ఏళ్ల వారు 29.58 శాతం, 60–69 ఏళ్ల వారు 25.18 శాతం ఉన్నారని వివరించారు. అత్యధికంగా 50–59 ఏళ్ల వయసు వారే ఉన్నారని మంత్రి తెలిపారు.

గుండెపోటు తొలి గంటలో చికిత్స.. 4,891 మందికి నిలిచిన ప్రాణాలు…

గుండెపోటు వచ్చినప్పుడు తొలి గంట చాలా కీలకమని మంత్రి శ్రీ సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు.  2024 జూన్‌ నుంచి 2026 సెప్టెంబరు 25 వరకు 5,111 మందికి స్టెమీ కార్యక్రమం ద్వారా ఉచితంగా సుమారు రూ.40 వేల విలువైన టెనెక్ట్‌ప్లస్‌ ఇంజెక్షన్‌ అందించినట్లు మంత్రి తెలిపారు. వీరిలో 95.69 శాతం మంది ప్రాణాలు దక్కించుకున్నారని  మంత్రి సత్య కుమార్ వివరించారు.