BREAKING
రాష్ట్రంలో త్వరలో ఇందిరమ్మ బీమా పథకం.. విద్యార్థులను భవిష్యత్తు మానవ వనరులుగా తీర్చిదిద్దడం లక్ష్యం.. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కు.. అసెంబ్లీలో ప్రభుత్వ విప్ కార్యాలయం ప్రారంభం ఢిల్లీ సత్యానికేతన్ హాస్టల్ ప్రమాదంపై అమిత్ షా దిగ్భ్రాంతి.. సీఎం మరియు ఎన్డీఆర్ఎఫ్ డీజీతో సమీక్ష దగుల్బాజీ కేటీఆర్‌.. ఖబడ్దార్‌!… ధైర్యం ఉంటే మీ బాపును అసెంబ్లీకి తీసుకురా.. యువతకు ముందు క్షమాపణలు చెప్పాలి… సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శిస్తే ఊరుకునేది లేదు.. కరీంనగర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆకుల నరసన్న… అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజులు వర్షాలే! ఢిల్లీ సత్యానికేతన్ హాస్టల్ ప్రమాదంలో ముగ్గురు మృతి.. పదకొండు మంది రక్షణ.. భవన యజమానిపై ఉక్కుపాదం మోపుతామన్న సీఎం హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ-మెట్రో ఉమ్మడి పాస్ త్వరలోనే! సెలెక్టర్ల ముందే ఇషాన్ కిషన్ సెంచరీ.. టీమిండియా రీఎంట్రీకి గట్టి సిగ్నల్! జైలు గోడల మధ్య దుబాసి శంకర్ జీవన పోరాటం. కార్మికుల హక్కుల సాధనకు పోరాటాలే శరణ్యం ఘనంగా ప్రారంభమైన ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు మా కష్టాన్ని అవహేళన చేయొద్దు...... ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: డాక్టర్ చంటి ముదిరాజ్* ఐక్యంగా ఉద్యమిస్తేనే జర్నలిస్టుల సమస్యల కు పరిష్కారం ! 20,000 ఎకరాలకు పైగానే ఉన్న జిరాయితీ, సొసైటీ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానని ఎంపీ హామీ పేదల ఆరోగ్య భరోసాకు సీఎం సహాయనిధి అండ.* *పాలకొల్లులో 98 మందికి రూ.62 లక్షల చెక్కులు పంపిణీ

పుట్టిన రోజునాడు పవన్ ఎక్కడ ?

Select Suryaa Now
పుట్టిన రోజునాడు పవన్ ఎక్కడ ?

 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు  కు అభిమానులు, నెటిజన్లు, సెలబ్రిటీలు, జనసైనికులు శుభాకాంక్షలు తెలపడమేకాదు  ఆయన ఇంటి వద్ద, కార్యాలయానికి వద్ద   అభిమానులు  చేసే హడావిడి అంటా ఇంతా కాదు .  ఇరు రాష్ట్రాలలోను  భారీ ర్యాలీలు, కేక్ కటింగ్ లతో పాటు సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు నిత్యా కృత్యం .  పవన్ కూడా జనసేన, తన అభిమానులు నిర్వహించే  కార్యక్రమాల్లో పాల్గొనేవారన్నది తెలిసిందే . అయితే ఈసారి  తన పుట్టిన రోజు నాడు పవన్ కళ్యాణ్ తన   అభిమానులకు, కార్యకర్తలకు అందుబాటులో లేకపోవటం విశేషం .   కుడి భుజానికి    శస్త్రచికిత్స చేయించుకున్నఆయన సన్నిహితుల సూచనలతో ఆయుర్వేద చికిత్స నిమిత్తం   కేరళ రాష్ట్రము   త్రిస్సూర్ దగ్గర్లో ఉన్న   ఆయుర్వేద వైద్యశాలలో చేరారు. అక్కడి వైద్యులు  ప్రత్యేక థెరపీ ద్వారా చికిత్స చేస్తున్న విషయం కూడా తెలిసిందే  నెల రోజులు పాటు   చికిత్స  అవసమని వైద్యులు చెప్పడంతో ఆంధ్ర ప్రదేశ్ కాబినెట్ సమావేశాలకు కూడా ఆయన దూరం గా ఉన్నారు . ఈ క్రమంలోనే  పవన్ కళ్యాణ్ నేడు తన పుట్టిన రోజు   కూడా అక్కడే  జరుపుకున్నట్టు తెలుస్తోంది,  ఇక్కడ జరిగే ప్రోగ్రామ్స్ కి  స్థానిక జనసేన లీడర్లు, శాసనసభ్యలు, ఎంపీ లు  సారథ్యం వహింస్తుండగా  . పవన్ కేరళ నుంచి   ఆన్లైన్ లో జనసేన  కార్యకర్తలు , అభిమానులని ఉద్దేశించి మాట్లాడటం  విశేషం .  ఏ సందర్భంగా ఆయనకు అనేక మంది లైవ్ లోనే శుభాకాంక్షలు   తెల్పగా కేరళలో ఉన్న  తెలుగు వారి తో పాటు , కేరళ పవన్ కళ్యాణ్ అభిమానులు  ఆయన బర్త్ డే ని సెలబ్రేట్ చేయటం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది . .    కాలికట్ లో 300 మంది నీట్ విద్యార్థులు  పవన్  పుట్టిన రోజుని  వేడుకగా నిర్వహించిన వీడియో సామాజిక మాధ్యమాలలో  వైరల్ గా మారింది. పవన్   త్వరగా కోలుకోవాలని అభిమానులు, జనసైనికులు  దేవాలయాలలో పూజలు కూడా నిర్వహించడం పలుచోట్ల కనిపించింది .