పరిసరాల పరిశుభ్రత తోనే వ్యాధులనుతరిమికొట్టవచ్చు
వంగర సూర్య: శుక్రవారంమండల పరిధిలోని కొప్పరవలస గ్రామంలో పారిశుధ్యంపై గ్రామస్థులకు డిప్యూటీ ఎంపీడీవో కెల్లరామారావుఅవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ ఎంపీడీవో మాట్లాడుతూ.. గ్రామాల్లో వ్యాధులు వ్యాపించకుండా ఉండాలంటే ప్రతీ ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఇళ్ల వద్దే తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా విభజించి గ్రామాల్లో చెత్త సేకరణకు వచ్చే చెత్త బండిలో వెయ్యాలని డ్రైనేజీల్లో. బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేయరాదని కోరారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.