BREAKING
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్: రోజువారీ సీఆర్‌ఆర్ నిర్వహణ నిబంధన 99 శాతానికి పెంపు.. అక్టోబర్ 16 నుంచే అమలు! భారత్ గుండెల్లో ఆఫ్రికా: విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టీకరణ! ఘనంగా ఫ్యూచర్ సిటీ రియల్ ఎస్టేట్ మండల అధ్యక్షుడి జన్మదిన వేడుకలు రోజంతా సరిపడా నీళ్లు తాగకపోతే శరీరంలో జరిగే అనర్థాలు ఇవే.. డీహైడ్రేషన్ లక్షణాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న రియల్ స్టోరీ క్రైమ్ థ్రిల్లర్.. వీకెండ్‌లో చూసేందుకు అద్భుతమైన మూవీ కొప్పర్రులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలి - సిపిఎం వట్టిప్రోలు రంగారావు ను సత్కరించిన...... వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షులు షేక్ నాజర్ లీజుకు తీసుకున్న బస్సులు అమ్ముకున్నారని ఆరోపణ.. బాధితులకు న్యాయం చేయాలి అంటున్న నల్లి రాజేష్.* అగ్ర హీరోలందరితో స్క్రీన్ షేర్.. కానీ మెగాస్టార్ చిరంజీవితో మాత్రం నటించని స్టార్ హీరోయిన్ కార్మికుల కొరత పరిష్కారానికి లావోస్ తీవ్ర కసరత్తు: స్వర్ణాంధ్ర కాలేజి ని సందర్శించిన నాక్ ఈసీ కమిటీ చైర్మన్ ఆచార్య నాగేశ్వరరావు రూ. 8 కోట్ల రెమ్యునరేషన్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన శ్రీనిధి శెట్టి.. ఏమన్నారంటే? ఉత్తర కొరియా ముప్పుపై దక్షిణ కొరియా, జపాన్ రక్షణ శాఖల కీలక భేటీ: రూ.248 కోట్లతో నర్సీపట్నం మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి! రూ.3 కోట్లతో వాకింగ్ ట్రాక్, కళ్యాణ మండపం పనులకు శ్రీకారం : స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇథియోపియా నేషనల్ ప్యాలెస్, మ్యూజియంను సందర్శించిన విదేశాంగ మంత్రి జైశంకర్

పరిసరాల పరిశుభ్రత తోనే దోమల నివారణ సాధ్యం

Select Suryaa Now
పరిసరాల పరిశుభ్రత తోనే దోమల నివారణ సాధ్యం

పులివెందుల మేజర్ న్యూస్ : 
స్థానిక నగరిగుట్ట అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం   లో గురువారం దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు, వాటి నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వైద్యాధికారి డాక్టర్ స్నేహ ప్రత్యూష, సబ్ యూనిట్ అధికారి సిద్దయ్య ఆధ్వర్యంలో చేపట్టారు.
ఈ సందర్భంగా వైద్యాధికారి మరియు ఇతర అధికారులు మాట్లాడుతూ... వర్షాకాలం, శీతాకాలాల్లో దోమల వల్ల డెంగ్యూ, మలేరియా, చికెన్‌గున్యా వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
*ముఖ్య సూచనలు:*

*దోమలు పుట్టకుండా:*  ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. పాత టైర్లు, కొబ్బరి బొండాలు, కూలర్లలో నీటిని ఎప్పటికప్పుడు తొలగించాలి.
*దోమలు కుట్టకుండా:*  రాత్రి వేళల్లో దోమతెరలు,  ఒళ్లంతా కప్పే దుస్తులు ధరించాలని సూచించారు.
*ఫ్రైడే - డ్రైడే:*  ప్రతి శుక్రవారం "ఫ్రైడే - డ్రైడే"గా పాటించి ఇళ్లలోని నీటి తొట్లు, డ్రమ్ములను ఖాళీ చేసి, ఎండబెట్టి తిరిగి శుభ్రమైన నీటిని నింపుకోవాలని పిలుపునిచ్చారు. 
అనంతరం సబ్ యూనిట్ అధికారి సిద్దయ్య నగరిగుట్ట ల్యాబ్ రోటరీ సందర్శించి రికార్డులు పరిశీలించడమైనది 
ఈ కార్యక్రమంలో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ హెప్సిభా, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు మరియు సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

పి కృష్ణ పులివెందుల స్టాప్ రిపోర్టర్ కడప జిల్లా