BREAKING
భారత్ గుండెల్లో ఆఫ్రికా: విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టీకరణ! ఘనంగా ఫ్యూచర్ సిటీ రియల్ ఎస్టేట్ మండలం అధ్యక్షుడి జన్మదిన వేడుకలు రోజంతా సరిపడా నీళ్లు తాగకపోతే శరీరంలో జరిగే అనర్థాలు ఇవే.. డీహైడ్రేషన్ లక్షణాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న రియల్ స్టోరీ క్రైమ్ థ్రిల్లర్.. వీకెండ్‌లో చూసేందుకు అద్భుతమైన మూవీ కొప్పర్రులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలి - సిపిఎం వట్టిప్రోలు రంగారావు ను సత్కరించిన...... వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షులు షేక్ నాజర్ లీజుకు తీసుకున్న బస్సులు అమ్ముకున్నారని ఆరోపణ.. బాధితులకు న్యాయం చేయాలి అంటున్న నల్లి రాజేష్.* అగ్ర హీరోలందరితో స్క్రీన్ షేర్.. కానీ మెగాస్టార్ చిరంజీవితో మాత్రం నటించని స్టార్ హీరోయిన్ కార్మికుల కొరత పరిష్కారానికి లావోస్ తీవ్ర కసరత్తు: స్వర్ణాంధ్ర కాలేజి ని సందర్శించిన నాక్ ఈసీ కమిటీ చైర్మన్ ఆచార్య నాగేశ్వరరావు రూ. 8 కోట్ల రెమ్యునరేషన్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన శ్రీనిధి శెట్టి.. ఏమన్నారంటే? ఉత్తర కొరియా ముప్పుపై దక్షిణ కొరియా, జపాన్ రక్షణ శాఖల కీలక భేటీ: రూ.248 కోట్లతో నర్సీపట్నం మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి! రూ.3 కోట్లతో వాకింగ్ ట్రాక్, కళ్యాణ మండపం పనులకు శ్రీకారం : స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇథియోపియా నేషనల్ ప్యాలెస్, మ్యూజియంను సందర్శించిన విదేశాంగ మంత్రి జైశంకర్ బీసీలకు టీడీపీ అండగా ఉంటుంది బుడా చైర్మన్‌ తెంటు లక్ష్మునాయుడు

పర్చూరులో అభివృద్ధి జోష్‌..

Select Suryaa Now
పర్చూరులో అభివృద్ధి జోష్‌..

 రూ.74.37 కోట్ల పనులకు శ్రీకారం !

-హోంమంత్రి అనిత, ఎమ్మెల్యే ఏలూరి చేతుల మీదుగా

-పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

ఏపీ స్టేట్ బ్యూరో, అమరావతి:

 పర్చూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. నియోజకవర్గవ్యాప్తంగా ఒకేసారి రూ.74.37 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పర్చూరు పట్టణంలో టీడీపీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు హోంమంత్రికి ఘనస్వాగతం పలికారు.

సంక్షేమానికి పెద్దపీట.. అభివృద్ధికి నిరంతర కృషి

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాల అమలుకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని హోంమంత్రి అనిత తెలిపారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని అన్నారు.పర్చూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో కలిసి పర్యటించిన ఆమె.. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నిరంతరం పనిచేస్తున్నారని పేర్కొన్నారు.

28 వేల ఎకరాలకు సాగునీరు.. గుంటూరు ఛానల్‌ పొడిగింపు

పర్చూరు ప్రాంత రైతులకు కీలకమైన గుంటూరు ఛానల్‌ పొడిగింపు పనులపై హోంమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగించడం శుభపరిణామమని, దీనివల్ల సుమారు 28 వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందని తెలిపారు.సాగునీటి సదుపాయాలు మెరుగుపడితే పర్చూరు ప్రాంతంలో వ్యవసాయ రంగానికి మరింత ప్రయోజనం చేకూరుతుందని, రైతులకు సాగునీటి భరోసా పెరుగుతుందని చెప్పారు.

పర్చూరు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి.. ఏలూరి

ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ పర్చూరు నియోజకవర్గంలో రూ.74.37 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేందుకు వచ్చిన హోంమంత్రి అనితకు కృతజ్ఞతలు తెలిపారు. గత ఐదేళ్లలో నియోజకవర్గం నిర్లక్ష్యానికి గురైందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పర్చూరు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు.జల్‌ జీవన్‌ మిషన్‌, గుంటూరు ఛానల్‌ పొడిగింపు, ఎస్సీ/ఎస్టీ వసతి గృహాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఆరోగ్య కేంద్రాలు వంటి పనులతో నియోజకవర్గంలో మౌలిక వసతులు మెరుగుపడతాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం పర్చూరు అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

పర్చూరులో ఫైర్‌స్టేషన్‌.. ఇక అత్యవసర సేవలు మరింత వేగంగా

పర్చూరు నియోజకవర్గ కేంద్రంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు ఎంతో ప్రయోజనకరమని ఎమ్మెల్యే ఏలూరి పేర్కొన్నారు. గతంలో పర్చూరు ప్రాంతంలో అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు చీరాల, చిలకలూరిపేట నుంచి అగ్నిమాపక సిబ్బంది రావాల్సి వచ్చేదని తెలిపారు.స్థానికంగా ఫైర్‌స్టేషన్‌ అందుబాటులోకి వస్తే అత్యవసర సమయాల్లో ప్రజలకు సకాలంలో అగ్నిమాపక సేవలు అందే అవకాశం ఉంటుందని చెప్పారు. ఫైర్‌స్టేషన్‌ ఏర్పాటుకు సహకరిస్తున్న హోంమంత్రి అనితకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

గంజాయి నియంత్రణపై కఠిన చర్యలు

రాష్ట్రంలో గంజాయి వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం ఈగల్‌ బృందాలను ఏర్పాటు చేసిందని హోంమంత్రి అనిత తెలిపారు. తమ పిల్లలు గంజాయికి అలవాటుపడ్డారని పలువురు తల్లులు టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.గంజాయి వ్యసనానికి గురైన వారికి చికిత్స, పునరావాసం కల్పించేందుకు రిహాబిలిటేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భద్రత కోసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.

రూ.59.74 కోట్లతో జల్‌ జీవన్‌ మిషన్‌ పనులు

పర్చూరు నియోజకవర్గవ్యాప్తంగా రూ.59.74 కోట్లతో చేపట్టనున్న జల్‌ జీవన్‌ మిషన్‌ పనులకు హోంమంత్రి అనిత, ఎమ్మెల్యే ఏలూరి శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఈ పనులు కీలకంగా మారనున్నాయి.అదేవిధంగా రూ.5 కోట్లతో నిర్మిస్తున్న నూతన ఎస్టీ హాస్టల్‌ భవనాన్ని వారు పరిశీలించారు. పర్చూరు ఇందిరా కాలనీలో రూ.3 కోట్లతో నిర్మించిన 22 సీసీ రోడ్లను ప్రారంభించారు.

మహిళా సంఘాలకు రూ.3 కోట్ల శ్రీనిధి రుణాలు

పర్చూరులో మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.3 కోట్ల విలువైన శ్రీనిధి రుణాలు, పనిముట్లను మంత్రి అనిత, ఎమ్మెల్యే ఏలూరి పంపిణీ చేశారు. మహిళా పారిశ్రామికవేత్తలు, లబ్ధిదారులు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి వారి ఉత్పత్తులను పరిశీలించారు.మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు.

రూ.59.74 కోట్లు: నియోజకవర్గవ్యాప్తంగా జల్‌ జీవన్‌ మిషన్‌ పనులకు శంకుస్థాపన, రూ.5 కోట్లు: పర్చూరులో నూతన ఎస్టీ హాస్టల్‌ భవనం, రూ.3 కోట్లు: స్వయం సహాయక సంఘాలకు శ్రీనిధి రుణాలు, పనిముట్ల పంపిణీ, రూ.3 కోట్లు: ఇందిరా కాలనీలో 22 సీసీ రోడ్ల ప్రారంభం, రూ.1.08 కోట్లు: మూడు విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లకు శంకుస్థాపన, రూ.96 లక్షలు: పర్చూరు, పట్టణంలో 12 కి.మీ. మ్యాజిక్‌ డ్రైన్ల నిర్మాణం, రూ.67 లక్షలు: లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ, రూ.44 లక్షలు: శ్రీ వెంకటేశ్వరస్వామి పాదాల రోడ్డుకు శంకుస్థాపన

రూ.35 లక్షలు: వెటర్నరీ హాస్పిటల్‌ నిర్మాణానికి శంకుస్థాపన,రూ.12.50 లక్షలు: ఫిల్టర్‌ బెడ్‌ ప్రారంభోత్సవం జరిగినది.

పర్చూరులో సందడి.. ఘన స్వాగతం

హోంమంత్రి అనిత పర్చూరు పర్యటన సందర్భంగా టీడీపీ శ్రేణుల్లో సందడి నెలకొంది. పర్చూరు వై జంక్షన్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.నాయకులు, కార్యకర్తలు పుష్పగుచ్ఛాలు, శాలువాలతో హోంమంత్రిని సత్కరించారు. బాణాసంచా పేల్చి సంబరాలు నిర్వహించారు. రూ.74.37 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం, సాగునీటి ప్రాజెక్టులు, తాగునీరు, రోడ్లు, డ్రైనేజీలు, ఆరోగ్య సదుపాయాలు, మహిళా సంఘాలకు ఆర్థిక చేయూతతో పర్చూరు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకున్నాయని నాయకులు పేర్కొన్నారు.