పలు పతకాలు సాధించిన ఈదుపల్లి ఆక్స్ఫర్డ్ పాఠశాల విద్యార్థులు
నగరం, మేజర్ న్యూస్:
7వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జూ-జిట్సు ఛాంపియన్ షిప్ పోటీల్లో స్థానిక మండల పరిధిలోని ఈదుపల్లి ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల విద్యార్థుల పలు పతకాలు సాధించారు. ఈ నెల 3, 4 తేదీల్లో
ప్రకాశం జిల్లా, కొత్తపల్లి ఎస్ఆర్ఆర్బీ పాఠశాలలో జూ-జిట్సు మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ షిప్ - 2026 పోటీలు నిర్వహించారు. అండర్ 10, 12, 14 కేటగిరీ ఫైట్ సిస్టం విభాగంలో పాఠశాలకు చెందిన కె. దీక్షిత (బంగారు పతకం), కె. గ్రీష్మ దుర్గా (రజత పతకం) సాధించారు. కె. ధామిని, జి. గీతిక, బి వి కృష్ణ మనోహర్ లు కాంస్య పతకాలు పొందారు. బంగారు పతకం సాధించిన కె . దీక్షిత 2027 లో జరగనున్న నేషనల్ టోర్నమెంట్ కు ఎంపికయ్యారని పాఠశాల డైరెక్టర్ యోనాబాబు, ప్రిన్సిపల్ నాగరాజులు తెలిపారు. బుధవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో పతకాలు సాధించిన విద్యార్థులను డైరెక్టర్ యోనాబాబు, ప్రిన్సిపల్ నాగరాజు, ఇతర ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.