పల్నాడులో స్పెషల్ టెట్‌కు సర్వం సిద్ధం
నరసరావుపేట మేజర్ న్యూస్ : జిల్లాలో అక్టోబరు 11 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్న స్పెషల్ టెట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈవో పి.వి.వి. రామారావు తెలిపారు. నాలుగు పరీక్షా కేంద్రాల్లో 2,017 మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి. అభ్యర్థులు హాల్‌టికెట్, ఆధార్ కార్డుతో నిర్ణీత సమయానికి గంట ముందుగా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. దివ్యాంగులకు నిబంధనల ప్రకారం ప్రత్యేక సౌకర్యాలతో పాటు 50 నిమిషాల అదనపు సమయం కల్పించనున్నట్లు వెల్లడించారు.
రిపోర్టర్, మల్లికార్జున్