పల్లెపండుగకు భారీగా తరలిరావాలి
ప్రజల సమీకరణపై అడుసుమల్లి ప్రభాకర్‌చౌదరి సమీక్ష
పామూరు, మేజర్ న్యూస్ :
నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలలోని రామాపురం గ్రామంలో ఈ నెల 29న నిర్వహించనున్న పల్లెపండుగ–3.0 ప్రారంభోత్సవ బహిరంగ సభకు ప్రజలను భారీగా తరలించేలా కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల ప్రధాన కార్యదర్శి అడుసుమల్లి ప్రభాకర్‌చౌదరి పిలుపునిచ్చారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్‌కళ్యాణ్ పాల్గొనే పల్లెపండుగ–3.0 బహిరంగ సభకు ప్రజల సమీకరణపై సోమవారం సాయంత్రం మండలంలోని బొట్లగూడూరు పంచాయతీలో ఆ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, కనిగిరి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు సభకు ప్రజలను సమీకరించేందుకు చేపట్టాల్సిన చర్యలపై నాయకులు, కార్యకర్తలతో చర్చించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు కోటపాటి వెంకటేశ్వర్లు, కోటపాటి రాజా, యూనిట్ ఇన్‌చార్జి దేవరపు చలపతిరావు, ఫీల్డ్ అసిస్టెంట్ ఆవుల నరసింహం, కమ్మ నరసింహం, బొమ్మినేని శివ, గూడూరు వెంకటాద్రి, చిమ్మిలి వెంకటకృష్ణ పాల్గొన్నారు.