BREAKING
భారత ఆర్కిటిక్ యాత్రలో గీతం పరిశోధకుడు విశాఖ ఉక్కులో తప్పిన ముప్పు: నేలపాలైన ద్రవ ఉక్కు జియోఫిజిక్స్ విభాగానికి చెందిన పూర్వ విద్యార్థులు సహకారం గుండె సమస్యలపై శ్రద్ధ వహించాలి..! చోరీ సొత్తు రికవరీలో ప్రతిభ.. సౌత్‌ క్రైమ్‌ పోలీసులకు 4 రివార్డులు పారిశ్రామికవాడలో పేదల పట్టాభిషేకం పేదవాడి ఆత్మగౌరవానికి ‘పట్టా’భిషేకం! స్థానిక సమరానికి వైకాపా సమరశంఖం : మళ్ళా విజయప్రసాద్ దిశానిర్దేశం 48వ వార్డులో 800 మంది పేద కుటుంబాలకు పేదలకు పట్టాభిషేకం నిర్వహించిన ఎమ్మెల్యే పద్మనాభం ప్రశాంతంగా ముగిసిన పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ ఎమ్ సి ) ఎన్నికలు తెలంగాణలో విద్యుత్‌ డిమాండ్‌ ఆల్‌టైమ్‌ రికార్డు భారత సీనియర్ రెజ్లింగ్ జట్లకు డాక్టర్‌గా గుంటూరు వైద్యుడు పవన్ కుమార్ ఖండే నియామకం! డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో రూ.10 కోట్ల మోసం గ్లోబల్ ఎనర్జీ దిగ్గజం బీపీ కీలక నిర్ణయం అన్ని ఆర్థిక నిబంధనల ఉల్లంఘన కేసుల్లో దోషిగా తేలిన ప్రముఖ ఫుట్‌బాల్ క్లబ్!

పల్లెల ప్రగతే కూటమి ప్రభుత్వ ధ్యేయం

Select Suryaa Now
పల్లెల ప్రగతే కూటమి ప్రభుత్వ ధ్యేయం

పల్లెల రూపురేఖలు మార్చే అభివృద్ధి పండుగ . పేద బడుగు బలహీన వర్గాల కాలనీలో మౌలిక వసతులు మెరుగుపరచడమే లక్ష్యం. వెంకటాపురంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. దర్శి మేజర్ న్యూస్. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల సమగ్ర స్వరూపాన్ని మార్చి గ్రామ స్వరాజ్యం సాధన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి పథకాలను వేగవంతంగా చేస్తుందని నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అన్నారు. దర్శి మండలం, తూర్పు వెంకటాపురం గ్రామంలో “పల్లె పండుగ 3.0” లో భాగంగా “విబీ జీ రాం జీ పధకం” క్రింద మంజూరైన రూ : 2 లక్షల రూపాయలతో గోకులం షెడ్ నిర్మాణానికి దర్శి టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ మాట్లాడుతూ గ్రామాల్లో ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన మెరుగైన జీవన ప్రమాణాలు నిరంతర ఉపాధి అవకాశాలను సృష్టించడం ద్వారా పల్లెలను స్వయం సమృద్ధి కేంద్రాలుగా తీర్చేందుకు యంత్రాంగం నడుము బిగించిందని ,పాలనను ప్రజల ముంగిటకు చేర్చి అభివృద్ధి కార్యక్రమాలను స్థానిక ప్రజలను భాగస్వామ్యం చేస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సరికొత్త జవజీవాలను అందిస్తుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమం లో దర్శి ఏఎంసి చైర్మన్ దారం నాగవేణి - సుబ్బారావు, దర్శి మండల టిడిపి అధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు, ఏపీవో మురళి, గ్రామ టిడిపి నాయకులు కర్నాటి వెంకట నారాయణ, కర్నాటి సుబ్బారావు, జంపాల యలమంద, పిన్నిక సత్యనారాయణ, స్థానిక నాయకులు పాల్గొన్నారు.