పల్లె పోరుకు సర్వం సిద్ధం..నేడే పరిషత్ ‘మహా’ సంగ్రామం!
గరుగుబిల్లి, సూర్య : స్థానిక సంస్థల సమరంలో అత్యంత కీలకమైన ఘట్టానికి సమయం ఆసన్నమైంది.అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల సంబరానికి సర్వం సిద్ధమైంది.షెడ్యూల్ ప్రకారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ కు సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం ఏడు గంటల నుండి పోలింగ్ ప్రక్రియ ప్రారం భం కానుంది.మండల పరిధిలోని 13 ఎంపీటీసీ స్థానాలకు గాను 49 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మండల పరిషత్ అభివృద్ధి కార్యాల యంలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహణకు సంబం ధించి ఎన్నికల మెటీరియల్ ను పోలింగ్ సిబ్బందికి అందజేశారు.13 ఎంపీటీసీ స్థానాల పరిధిలో ఆరు రూట్లు,మూడు జోన్లుగా విభజించడం జరిగిందని అదే విధంగా ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశామని మండల ప్రత్యేక అధికారి ఎం వాణిశైలజ వెల్లడించారు.ఎంపిటిసి,జడ్పిటిసి ఎన్నికలకు సంబంధించి 59 మంది పీవోలు,59 మంది ఏపీవోలు, 210 మంది ఒపిఓలు విధులు నిర్వహించ డం జరుగుతుందన్నారు.13 ఎంపీటీసీ స్థానాల పరిధిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బందిని బస్సుల్లో తరలించడం జరిగిందని పేర్కొన్నారు.అదే విధంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి పిఓలు ఏపీఓలతో పాటు ఇతర సిబ్బందికి తగు సూచనలు సలహాలను అందజే యడం జరిగిందని రిటర్నింగ్ అధికారి ఎం వాణిశైలజ తెలిపారు.13ఎంపీటీ సీల పరిధిలో 38,959 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కోనున్నారని పేర్కొన్నారు.ఈకార్యక్ర మంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి నడిమింటి సూర్యనారాయణ, మండల పరిషత్ అభివృద్ధి కార్యాల యం ఏవో నాలి అర్జునరావు, డిప్యూటీ ఎంపీడీవో మరడాన వెంకటేశ్వరరావు, కార్యాలయ సిబ్బంది బెంకిలి శ్రీనివాస రావు ఎన్ కులశేఖర్ గుంట్రేడ్డి కృష్ణ ప్రసాద్, అలజంగి శ్రీకాంత్, గంట విజయలక్ష్మి,డాకోజు సూర్యప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.