BREAKING
ఫోన్ ట్యాపింగ్ వివాదం: ఇండోనేషియా చీఫ్ ఆఫ్ స్టాఫ్ తొలగింపు అందరినీ ఆకట్టుకునేలా 'బాలుగీత' సినిమా.. నవంబర్ 5 నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్: నిర్మాత సుప్రియ యార్లగడ్డ సోషల్ మీడియా నిషేధాన్ని సమర్థించుకున్న ఆస్ట్రేలియా బైనాన్స్ హ్యాక్ ఖండన.. క్షిపణులను ప్రయోగించిన ఉత్తర కొరియా ఓటీటీలో రికార్డులు సృష్టిస్తున్న 'ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్'.. భారీ వాచ్ టైమ్‌తో దూసుకుపోతున్న కామెడీ థ్రిల్లర్! రైలు ప్రమాదాల నేపథ్యంలో స్పెయిన్ రవాణా మంత్రి రాజీనామా ప్రజా నిరసనలతో సతమతమవుతున్న ఐరోపా ప్రభుత్వాలు ఐరోపా వ్యాప్తంగా ఏడు విమానాలకు బాంబు బెదిరింపులు లూలా గెలుపు: గ్లోబల్ సౌత్‌కు నిజమైన పరీక్ష *రెండు లక్షల పనికి నాలుగు లక్షల ఎంబి రికార్డు చేయించుకున్న గ్రామ సర్పంచ్ అట్ల శ్రీనివాస్ అడవిలోకి రెండో పులిని విడుదల చేసిన కజకిస్తాన్ హెబ్రోన్‌లో పైకప్పులపై సెటిలర్ల డేరా: పాలస్తీనియన్ల నిరసన ధనుష్, మమ్ముట్టి క్రేజీ కాంబినేషన్‌లో 'ఓం: చాప్టర్ 1'.. నవంబర్ 20న భారీ రిలీజ్! అప్పన్నపేట పాఠశాలకు 50 బెంచీల వితరణ. శంషొద్దీన్ పూర్ గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం

బిహార్‌లో భారీ డ్రగ్స్ వేట: 46 వేల కిలోల గంజాయి సీజ్

Select Suryaa Now
 బిహార్‌లో భారీ డ్రగ్స్ వేట: 46 వేల కిలోల గంజాయి సీజ్

సూర్య క్రైమ్ డెస్క్, పాట్నా: బిహార్ రాష్ట్రంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై భద్రతా బలగాలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ 27 నాటికి రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన విస్తృత తనిఖీల్లో రికార్డు స్థాయిలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. బిహార్ పోలీసు విభాగం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం దాదాపు 46,549 కిలోల గంజాయి, 150 కిలోల స్వచ్ఛమైన హెరాయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ వందల కోట్ల రూపాయల్లో ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

డ్రగ్స్ అక్రమ రవాణా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ , నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మరియు స్థానిక పోలీసుల సమన్వయంతో సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచారు. ముఖ్యంగా నేపాల్ అంతర్జాతీయ సరిహద్దులతో పాటు పొరుగున ఉన్న పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ సరిహద్దు మార్గాల గుండా రాష్ట్రంలోకి ప్రవేశించే అనుమానాస్పద వాహనాలను నిరంతరం తనిఖీ చేస్తున్నారు.

అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాలు బిహార్‌ను ఒక ప్రధాన రవాణా కారిడార్‌గా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని, ఆ నెట్‌వర్క్‌లను పూర్తిగా ధ్వంసం చేసే లక్ష్యంతో కఠిన నిఘా ఏర్పాటు చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ఏడాది కాలంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించి వేలాది కేసులు నమోదు చేసి, కీలక స్మగ్లర్లతో సహా పలువురు నిందితులను అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. నిఘా సమాచారం ఆధారంగా రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినల్స్, జాతీయ రహదారులపై మరింత కట్టుదిట్టమైన తనిఖీలు కొనసాగుతున్నాయి.