పైథాన్ శిక్షణ వర్క్‌షాప్ విజయవంతంగా పూర్తి
ఎమ్మిగనూరు
: సెయింట్ జాన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (అటానమస్)లోని CSE–డేటా సైన్స్ విభాగం, శ్రీ వెన్సీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో నిర్వహించిన ఐదు రోజుల పరిశ్రమ ఆధారిత పైథాన్ ప్రోగ్రామింగ్ శిక్షణ కార్యక్రమం మంగళవారం విజయవంతంగా ముగిసింది.
ఈ శిక్షణలో విద్యార్థులకు ప్రాక్టికల్ నైపుణ్యాలు, పరిశ్రమ అనుభవం, రియల్‌టైమ్ ప్రాజెక్టులపై అవగాహన కల్పించారు. ప్రస్తుత పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు పెంపొందించుకోవడం ద్వారా విద్యార్థులకు ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. సుధాకర్ తెలిపారు.
ఈ కార్యక్రమానికి సహకరించిన కళాశాల పూర్వ విద్యార్థిని, శ్రీ వెన్సీ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జె. దుర్గ (2006 బ్యాచ్)కు కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, అధ్యాపకులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో CSE విభాగాధిపతి డా. పి. వేరేష్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.