పార్వతీపురం నియోజకవర్గ ఎన్నికల నిర్వాహక దళ్ సభ్యులుగా సీతానగరం మండల జనసేన నాయకులు
సీతానగరం, సూర్య : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్వతీపురం నియోజకవర్గ ఎన్నికల నిర్వాహక దళ్ సభ్యులుగా సీతానగరం మండలానికి చెందిన జనసేన నాయకులు రెడ్డి మణికంఠ, కాల్యంపూడి సత్యన్నారాయణ, కృష్ణవేణి, గొలగన సత్యన్నారాయణ, చుక్క తవిటి నాయుడు, జక్కు గణేష్‌లను నియమించారు. ఈ సందర్భంగా వారు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలియజేయగా, పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.
రిపోర్టర్ : పిల్లి సతీష్ కుమార్, సీతనగరం, పార్వతీపురం మన్యం.