పార్వతీపురం అసెంబ్లీ ఎన్నికల సమన్వయ కమిటీలో కాల్యంపూడి దంపతులకు చోటు
సీతానగరం, సూర్య : పార్వతీపురం: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, ఎన్నికల నిర్వహణలో సమన్వయాన్ని పటిష్టం చేయడం లక్ష్యంగా జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల సమన్వయ కమిటీలను ప్రకటించారు. ఇందులో భాగంగా పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల సమన్వయ కమిటీలో సీతానగరం మండలం జోగింపేట గ్రామానికి చెందిన జనసేన నిర్వాహక దళ్ సభ్యులు కాల్యంపూడి సత్యన్నారాయణ, కాల్యంపూడి కృష్ణవేణి చోటు సంపాదించారు.
.ఈ సందర్భంగా కాల్యంపూడి సత్యన్నారాయణ, కృష్ణవేణి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేయడం, స్థానిక రాజకీయ పరిస్థితులు మరియు ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి పార్లమెంటరీ స్థాయి కమిటీకి అందించడం, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం ఈ కమిటీల ప్రధాన ఉద్దేశం అని “జనసేన పార్టీపై ఉన్న నిబద్ధతతో పనిచేస్తున్న మాకు ఎన్నికల సమన్వయ కమిటీలో చోటు కల్పించడం సంతోషంగా ఉంది. మాపై నమ్మకంతో ఈ బాధ్యతలో భాగస్వామ్యం కల్పించిన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, పార్టీ పెద్దలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం” అని “పార్టీ మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, అప్పగించిన బాధ్యతలను క్రమశిక్షణతో, నిబద్ధతతో నిర్వహిస్తాం. నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ పార్టీ సంస్థాగత బలోపేతానికి, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమాల సమర్థవంతమైన నిర్వహణకు మా వంతు కృషి చేస్తాం” అని వారు తెలిపారు.అదేవిధంగా, ఎన్నికల సమన్వయ కమిటీలో చోటు పొందిన ఇతర నాయకులు, కార్యకర్తలకు కాల్యంపూడి దంపతులు శుభాకాంక్షలు తెలియజేశారు.
రిపోర్టర్ : పిల్లి సతీష్ కుమార్, సీతనగరం, పార్వతీపురం మన్యం.