పారిశుధ్యం పరిశుభ్రంగా ఉండాలి అడిషనల్ కమిషనర్ నల్లనయ్య
సీతమ్మధార, సూర్య : జీవీఎంసీ 26 వార్డులో పారిశుద్ధ్యం నిర్వహణ సక్రమంగా జరిగే విధంగా అధికారులు పర్యవేక్షణ ఉండాలని, డోర్ టు డోర్ కలెక్షన్కు నిర్మితమైన వెహికల్స్ ప్రతి ఇంటి దగ్గర నుండి చెత్తను సేకరించాలని, వార్డు పరిధిలో ఎటువంటి జివిపిఎస్ ఉండకుండా చూడాలని, వ్యర్థాలను రోడ్లపై వాణిద్య సముదాయాలు వద్ద బహిరంగ పాడవేసినట్లయితే జరిమానా విధించాలని, జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ (పబ్లిక్ హెల్త్) పి.నల్లనయ్య ఆదేశించారు. "బ్రీఫింగ్ బుధవారం" కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసి వార్డు పనితీరు వార్డు కార్యాచరణ గురించి తెలుసుకొని వార్డుకు అనుగనంగా అవగాహన సదస్సు నిర్వహించారు.ఆయన క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా నార్త్ జోన్ పరిధిలోని, 26వ వార్డు ,అక్కయ్యపాలెం సమీప ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ (పబ్లిక్ హెల్త్) పి.నల్లయ్య మాట్లాడుతూ, వార్డులో పారిశుధ్యం మెరుగు పరిచేందుకు చర్యలు చేపట్టి వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించాలని, మరి ముఖ్యంగా డోర్ టు డోర్ కలెక్షన్ మీద శ్రద్ధ వహించాలని వ్యర్థాలను వ్యాపారస్తులు రోడ్లపై బహిరంగ ప్రదేశాల్లో కాలువలలో పడవేయకుండా అవేర్నెస్ క్యాంపులు నిర్వహించాలని, కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రపరిచి పారిశుద్ధ్యన్ని మెరుగుపరిచేలా చూడాలని తెలియజేశారు.వార్డులో పారిశుద్ధ్య కార్మికులు, క్లాప్ వాహనాలు,నిర్ణీత సమయానికి కేటాయించిన ప్రాంతాల్లో ఉండాలని ఆదేశించారు. క్రొత్త నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ మెటీరియల్ కాలువల మీద ఉండటం పట్ల ఆగ్రహం వ్యక్తపరిచారు.ఈ పర్యటనలో 26వ వార్డు సానిటరీ ఇన్స్పెక్టర్ కే.తేజ వార్డ్ శానిటేషన్ ఎన్విరాన్మెంట్ కార్యదర్శిలు, సూపర్వైజర్లు,తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : శ్రీను, సీతమ్మధార, విశాఖపట్నం.