BREAKING
జిమ్‌కు వెళ్లకపోయినా ఫిట్‌గా ఉండొచ్చా? రోజువారీ జీవితంలో కదలికను పెంచే సింపుల్ మార్గాలు ఆరోగ్యంగా ఉండటానికి పెద్ద మార్పులు అవసరం లేదు.. రోజూ చేసే ఈ చిన్న పనులతోనే మొదలు పెట్టండి అత్తిలి ఎస్వీఎస్ఎస్ విద్యాసంస్థల సెక్రటరీ & కరస్పాండెంట్‌గా మద్దాల శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక చిన్నారుల భవిష్యత్తుకు పునాది అంగన్వాడి టీఎంజేఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా వత్తుల రఘుపతి రైలు కిందపడిన వ్యక్తికి తీవ్ర గాయాలు పార్లమెంట్ కార్యాలయ భవన పనుల పరిశీలన అమరావతిలో చంద్రబాబు, లోకేష్‌తో చిన్న శ్రీను, సిరమ్మ భేటీ నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్‌‌.. విద్యాశాఖ సమీక్షలో మంత్రి లోకేష్ ఆదేశం ఎస్సీల నిధులు ఎస్సీ కాలనీల అభివృద్ధికే వినియోగించాలి ఎస్సీ నిధులు దారి మళ్లిస్తే సహించేది లేదు బీఎస్పీ కృష్ణాజిల్లా అధ్యక్షులు గుంటూరు నాగేశ్వరరావు వెల్లి విరిసిన ఆత్మీయత ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీపై పరిశీలించిన డిప్యూటీ ఎంపీడీవో.. మొదటి వారంలో 52 కోట్లు రాబట్టిన ‘వాన్’ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వం ఎజెండా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన శాసనసభ్యులు కిమిడి కళావెంకటరావు.

పారిశుద్ధ్య కార్మికుల కోసం ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం

Select Suryaa Now
పారిశుద్ధ్య కార్మికుల కోసం ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం

 

టెక్కలి మేజర్ న్యూస్:1
సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా  పంచాయతీ ఆవరణంలో పారిశుద్ధ్య కార్మికుల కోసం ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల, నౌపడ వైద్యులు డాక్టర్ జె. ప్రవీణ్ కుమార్ సహకారంతో టెక్కలి బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిరానికి పారిశుద్ధ్య కార్మికుల నుంచి విశేష స్పందన లభించింది.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోటబొమ్మాళి మార్కెట్ కమిటీ చైర్మన్ బగాది శేషగిరిరావు, టెక్కలి పట్టణ టీడీపీ అధ్యక్షులు లవ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆయుర్వేద వైద్యం ప్రాచీన కాలం నుంచి ప్రజలకు అందుబాటులో ఉన్న సంప్రదాయ వైద్య విధానమని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయుర్వేద వైద్య సేవలు, మందుల సరఫరాకు ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయమన్నారు.
ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల కోసం ప్రత్యేకంగా ఆయుర్వేద వైద్య శిబిరం ఏర్పాటు చేయడం మంచి కార్యక్రమమని పలువురు అభిప్రాయపడ్డారు. ప్రతిరోజూ పట్టణ పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యంపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగించాలని పంచాయతీ ఈవో శ్రీనివాస రావు తెలిపారు.
కార్యక్రమంలో నియోజకవర్గ బీఎల్ఏ-2 అట్టాడ రవి బాబ్జి, బీజేపీ టెక్కలి మండల అధ్యక్షులు జర్జాన రాంజీ, నియోజకవర్గ సేవా సంకల్ప అభియాన్ ఇన్‌చార్జి తమ్మినేని ఆనందరావు, రాష్ట్ర యువమోర్చా ఉపాధ్యక్షులు బూర నరేంద్ర, జిల్లా ఉపాధ్యక్షులు నడుపూరు లక్ష్మీనారాయణ, టీడీపీ నాయకులు ప్రఫుల్ల, బీజేపీ రాష్ట్ర మోర్చా సభ్యులు దుప్పాన రాజకుమార్, జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షులు జన్ని పరమేశ్వర్, మండల జనరల్ సెక్రటరీ శాసనపురి శ్రీను, మండల ఉపాధ్యక్షులు ఆకుల ప్రకాష్, నందిగామ మండల అధ్యక్షులు కామరాజు, సోషల్ మీడియా ప్రతినిధి మురళీకృష్ణ, తారక్,
కూన రమణ, సోమేశ్వరరావు, పద్మావతి, గేదెలు చంద్రశేఖర రావు,
పంచాయతీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.