BREAKING
యూఎస్ లేబర్ డిపార్ట్‌మెంట్ నిర్ణయంపై టీసీఎస్ స్పష్టత పుత్తా నరసింహారెడ్డి జన్మదిన వేడుకలు వల్లూరులో ఘనంగా కేక్‌ కటింగ్‌ టిడిపి కార్యాలయంలో సందడి.. ఇంటింటా చెత్త వేర్పాటుపై అవగాహన పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించిన అధికారులు.. ఎమ్మెల్యే సాబ్.. మా ఆఖరి మజిలీకి జానెడు స్థలం చూపించండి!. అమెరికా బాండ్ ఈల్డ్స్ తగ్గుదల, ఆర్‌బీఐ జోక్యంతో కుదుటపడిన కరెన్సీ మార్కెట్లు అమెరికా గ్రీన్ కార్డ్ ప్రక్రియ నిలిపివేతపై టీసీఎస్ కీలక ప్రకటన అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన ముడి చమురు ధరలు బ్రిటన్ రాజకీయాల్లో లేబర్ పార్టీకి ఊరట చెరకు రైతులకు తమిళనాడు ప్రభుత్వం తీపికబురు. మధ్యప్రదేశ్ ఎన్‌డీపీఎస్ కోర్టు సంచలన తీర్పు! కాంగ్రెస్ పార్టీ ఒడిశా బంద్‌పై బీజేపీ తీవ్ర ఆగ్రహం: సీఎం విజయ్ ఎన్నిక చెల్లదన్న పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు కీలక నిర్ణయం: కొట్టివేయాలన్న పిటిషన్‌పై తీర్పు అక్టోబర్ 14కు వాయిదా! ఉపఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభం: 5 అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానానికి నేడే ఓట్ల లెక్కింపు.. తుది ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ! పరిగిలో వీధి కుక్కల బీభత్సం.. బెంబేలెత్తుతున్న కాలనీవాసులు..! ట్రంప్ ప్రభుత్వ ఆరోపణలను ఖండించిన టెక్ దిగ్గజం!

ప్రతి సోమవారం మండల స్థాయి "ప్రజావాణి"

Select Suryaa Now
ప్రతి సోమవారం మండల స్థాయి "ప్రజావాణి"

23 శాఖల అధికారులతో ప్రజలకు  సమస్యల పరిష్కారం

చుంచుపల్లి, సూర్య (మేజర్ న్యూస్) తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన G.O.Ms.No.3 & 4 మార్గదర్శకాల మేరకు, ప్రజల సమస్యలను స్థానిక స్థాయిలోనే పరిష్కరించేందుకు, ప్రతి సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం చుంచుపల్లి మండల కార్యాలయం(MPDO కార్యాలయం)లో నిర్వహించబడుతుందని ఎంపీడీవో సుభాషిణి శుక్రవారం పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు.
ప్రతి సోమవారం ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు చుంచుపల్లి మండల పరిషత్ కార్యాలయంలో జరుగుతుందని, మండల పరిధిలోని 23 సంబంధిత ప్రభుత్వ శాఖల మండల స్థాయి అధికారులు ప్రజావాణి కార్యక్రమంలో హాజరై ప్రజల సమస్యలు, ఫిర్యాదులు మరియు వినతులను స్వీకరించి, వారి సమస్యలను పరిశీలించి నిర్ణీత కాలపరిమితిలో త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తారని,కావున ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం వివిధ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమం ద్వారా సంబంధిత అధికారులను ఒకే వేదికపై సంప్రదించే అవకాశం కల్పించబడుతుందని, ప్రజలు తమ సమస్యకు సంబంధించిన వినతి పత్రాలతో పాటు అవసరమైన ఆధారాలు, పత్రాల ప్రతులను తీసుకువచ్చి ప్రజావాణిలో సమర్పించవచ్చని, ప్రజల సమస్యలను అధికారులు సానుకూలంగా పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు.
ప్రజల సమస్యలు-అధికారుల దృష్టికి సమస్యలకు సత్వర పరిష్కారం-ప్రజల ముంగిట అనే లక్ష్యంతో మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని చుంచుపల్లి మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.