ఒమ్మవరంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం
డాక్టర్ రఘు నేతృత్వంలో శ్రీవైష్ణవి గోష్టి సభ్యుల సహకారంతో...
ఎస్.రాయవరం, అక్టోబర్ 9, మేజర్ న్యూస్: ఎస్.రాయవరం మండలం ఒమ్మవరం గ్రామంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో ఒమ్మవరం శ్రీవైష్ణవి గోష్టి సభ్యుల ఆధ్వర్యంలో కొరుప్రోలు ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి వారిచే ఈ ప్రత్యేక ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు, వృద్ధుల ఆరోగ్య సంరక్షణలో భాగంగా ఈ నెలంతా వృద్ధుల ఆరోగ్యం కోసం ప్రత్యేక మెడికల్ క్యాంపులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అందులో భాగంగానే వృద్ధులకు ప్రాధాన్యతనిస్తూ ప్రజలందరికీ ఉపయోగపడేలా ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించామని కొరుప్రోలు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల ఇంచార్జ్ వైద్యాధికారి డాక్టర్ రఘు తెలిపారు. కార్యక్రమంలో కొరుప్రోలు ఆయుర్వేద ఆసుపత్రి పంచకర్మ థెరపిస్ట్ గణపతి, యోగ నిపుణులు బి.సుధ, భాను విజయలక్ష్మి తదితరులు ఈ శిబిరంలో విలువైన వైద్య సేవల్ని అందించారు. కార్యక్రమంలో వృద్ధులతో పాటు పలువురు గ్రామస్థులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు