ఒక్క అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి... అభివృద్ధికి బాటలు వేద్దాం...
రాయదుర్గం మేజర్ న్యూస్ : సోమలాపురం పంచాయతీ బరిలో తెదేపా మద్దతు దారు సర్పంచి అభ్యర్థి మొండి గీతమ్మ... ప్రజలకు విజ్ఞప్తి చేసిన మొండి మల్లికార్జున దంపతులు... హీరేహాళ్ మండలంలోని సోమలాపురం పంచాయతీ బరిలో తెదేపా మద్దతుదారు సర్పంచ్ అభ్యర్థి తెదేపా సీనియర్ నాయకుడు, మాజీ ఎంపిటిసి సభ్యుడు మొండి మల్లికార్జున భార్య మొండి గీతమ్మ బరిలో నిలిచారు... ఈ సందర్భంగా మేజర్ న్యూస్ తో మొండి మల్లికార్జున దంపతులు మాట్లాడుతూ సోమలాపురం గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు సహాయశక్తుల మేర కృషి చేస్తామని, అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలకు నిలువెత్తు నిదర్శనం సోమలాపురంలో సిసి రోడ్లు, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు నోచుకునే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని మొండి దంపతులు పేర్కొన్నారు.. ఈ సందర్భంగా తమకు సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులకు, మార్కెట్ యార్డ్ చైర్మన్ హనుమంత్ రెడ్డి, ఎంపీపీ అభ్యర్థి పాటిల్ శైలజ మోహన్ రెడ్డికి, మండల కన్వీనర్ తలారి గంగాధర్ కు మొండి దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు…