నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రతాప్ కుమార్ రెడ్డి దంపతులు.
కావలి, మేజర్ న్యూస్ : కావలి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, తమ సతిమణి రామిరెడ్డి ఆదిలక్ష్మితో కలిసి పట్టణంలోని పలు వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. కావలి పట్టణ మాజీ కౌన్సిలర్ కుందుర్తి శ్రీనివాసులు కుమార్తె వివాహ వేడుకకు హాజరైన ప్రతాప్ కుమార్ రెడ్డి దంపతులు వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కావలి ట్రంక్ రోడ్డులోని ఆర్.ఎస్.ఆర్. కళ్యాణ మండపంలో జరిగిన కావలి రూరల్ మండలం, చెంచుగానిపాలెం పంచాయతీకి చెందిన జంపాని ప్రభు వివాహ వేడుకలో కూడా పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమాల్లో కావలి పట్టణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని వధూవరులకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు.