నూతన మార్చురీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్యెల్యే
కనిగిరి ,మేజర్ న్యూస్ :స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నూతనంగా నిర్మించిన మార్చురీ భవనాన్ని ఎమ్యెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి శనివారం ప్రారంభించారు .అలాగే ప్రభుత్వాసుపత్రి ఆవరణలో ప్రధాని నరేంద్ర మోడీ 25 సంవత్సరాల నిస్వార్ధ సేవ సంధర్భంగా ఆరోగ్య ,వైద్య శాఖ ,సేవా సంకల్ప్ ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును ఎమ్యెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ప్రారంభించారు .ఈ సంధర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలలో మౌళిక వసతులు కల్పించి కార్పొరేట్ వైద్యశాలగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు .ప్రజలు ప్రభుత్వ వైద్యశాల సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు .ఈ కార్యక్రమంలో డాక్టర్లు ఎంసి వెంకట సుబ్బయ్య ,తిరుపతిరెడ్డి ,పట్టణ టిడిపి అధ్యక్షులు షేక్ ఫిరోజ్ ,బుల్లా బాలబాబు ,బిజేపి నాయకులు గంజి మనోజ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు .