నూతన కార్యవర్గ నియమక పత్రాలు అందజేత
కైకలూరు, మేజర్ న్యూస్, స్థానిక ట్రావెల్స్ బంగ్లా వద్ద ఈరోజు దళిత ప్రజా జాయింట్ యాక్షన్ కమిటీ ఏపీ జేఏసీ నూతన కార్యవర్గం లో నీ యమాకా పత్రము దళిత ప్రజా జాయింట్ యాక్షన్ కమిటీ ఏపీ జెఎసి వ్యవస్థాప కూడు రాష్ట్ర అధ్యక్షులు గాలి ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షులు గా మద్ద ప్రేమ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శిగా కాగితాల నాగరాజు, జిల్లా కార్యదర్శిగా గాలి యోహాను, జిల్లా మహిళ ఉప అధ్యక్షురాలుగా పంతగాని ఝాన్సీ, మండవల్లి మండలం అధ్యక్షులుగా గొంతు పులి జయరాజు, రాష్ట్ర దళిత నాయకులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జక్కుల విజయ్ కుమార్ ద్వారా నియామక పత్రాలు అందజేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా నియమక పత్రాలు అందుకున్న ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులను అధికారులతో మాట్లాడి ప్రజలకు అందేలా మీ వంతు కృషి చేయాలన్నారు. దళిత ప్రజా ఏపీ జేఏసీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధ మత కులాంతర వివాహములు చేయబడును ప్రజాసేవకే అంకితం ఎస్సీ , ఎస్ టి, బీసీ మైనార్టీ ప్రజా సంఘాల స్ఫూర్తితో అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకి అందుబాటు లో ప్రజా సేవ చేసేలాగా మా వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు దళిత నాయకులు పాల్గొన్నారు.
రిపోర్టర్. రమేష్ కైకలూరు ఏలూరు జిల్లా