BREAKING
'ఈ ఫీల్డ్‌కు నేను సరిపోనేమో'.. వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్ ఆనంది కళ్యాణదుర్గం పురపోరు.. ఇక సమరమే...… చైర్‌పర్సన్‌ పీఠంపై టీడీపీ, వైకాపా గురి బరిలో పల్లవి, దొడగట్ట హర్షిణి అభ్యర్థుల ఖరారుతో వేడెక్కిన రాజకీయం.. గెలుపే లక్ష్యంగా ఇరు పార్టీల వ్యూహాలు...… డిసెంబర్ 4న నాగ చైతన్య 'వృషకర్మ' గ్రాండ్ రిలీజ్.. ఇంటెన్స్ లుక్‌తో సరికొత్త పోస్టర్ విడుదల కలెక్టరేట్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. పాల్గొన్న కలెక్టర్ దీపక్ తివారి కర్చల్ గ్రామంలో నూతన పెన్షన్ల వెరిఫికేషన్ -జిల్లా పరిషత్ సీఈవో జానకి రెడ్డి పరిశీలన పాప్స్ (PAPSS) చెల్లింపుల వ్యవస్థలో చేరిన ఇథియోపియా సెంట్రల్ బ్యాంక్ జనయేత్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డా. ఏపీజే అబ్దుల్ కలాం జయంతి* శ్రీకాళహస్తి ఎమ్మెల్యే తో జనసేన పార్టీ నేత మిద్దెల హరి భేటీ డాలర్ దాటికి ఆఫ్రికా దేశాల కరెన్సీల తడబాటు 'కరికాల' నా కెరీర్‌లోనే బెస్ట్ ఫిల్మ్ అవుతుంది.. వైభవంగా సందీప్ కిషన్ కొత్త చిత్రం ప్రారంభోత్సవం ప్రపంచానికి డీజిల్ ఎందుకు అంత అత్యవసరం? గ్లోబల్ మార్కెట్లో తీవ్ర కొరతకు గల కారణాలు.. తెరపైకి భారత రిఫైనరీల కీలక పాత్ర! *మధిర HP Gas agency లో విజిలెన్స్ అవగాహన కార్యక్రమం* 'జైలర్ 2' సినిమాపై హీరో ధనుష్ ప్రశంసల జల్లు.. సూపర్‌స్టార్ రజినీకాంత్ మ్యాజిక్ రిపీట్ ప్రజా సంక్షేమమే ధ్యేయం.. సరికొత్త రాజకీయ వేదికగా 'పి.ఆర్.కే. పార్టీ' ఆవిర్భావం! భక్తుల కొంగుబంగారం చిట్కుల్ శ్రీ తుల్జా భవాని అమ్మవారు -భక్తుల కోరిన కోరికలు తీర్చే అమ్మవారు -నవరాత్రులలో నిత్య అన్నదానం -భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నాం -ఆలయ వ్యవస్థాపకులు కే.జనార్దన్ చారి

నిఘా నీడలో జిల్లా.... శాంతియుతంగా ఎన్నికల నిర్వహణ

Select Suryaa Now
నిఘా నీడలో జిల్లా.... శాంతియుతంగా ఎన్నికల నిర్వహణ

విజయనగరం, సూర్య : ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని    జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు.  జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలను నిర్వహించే విధంగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పాత నేర‌స్తులు, గ‌తంలో గొడ‌వ‌ల‌కు పాల్ప‌డిన‌ సుమారు 20వేల మందిపై బైండోవర్ నమోదు చేశామన్నారు. వీరివ‌ద్ద‌నుంచి రూ.2ల‌క్ష‌లు నుంచి రూ.3ల‌క్ష‌లు పూచిక‌త్తు తీసుకోవ‌డం జ‌రిగింద‌న్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎవరైనా  గొడవకు దిగినా, గలాటా సృష్టించినా, వారిపై కేసులు నమోదు చేస్తామని, వారి పూచికత్తును రికవరీ చేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. ఇప్ప‌టికే ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చింద‌ని, పెద్ద‌మొత్తంలో డ‌బ్బు, ఇత‌ర విలువైన సామ‌గ్రి త‌ర‌లించిన‌ప్పుడు, దానికి సంబంధించిన ప‌త్రాలు త‌ప్ప‌నిస‌రిగా చూపించాల్సి ఉంటుంద‌ని, లేదంటే సీజ్ చేస్తామ‌ని తెలిపారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌ప్పుడు ప్ర‌చారాలు చేసినా, త‌ప్పుడు స‌మాచారం ఇచ్చినా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. శుక్ర‌వారం నుంచి జిల్లాలో చెక్‌పోస్టులు ప్రారంభ‌మ‌వుతాయ‌న్నారు.  ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సజావుగా, స్వేచ్ఛగా వినియోగించే విధంగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలంతా ప్రశాంతంగా ఎన్నికలను జరిపేందుకు తమ వంతు సహకారాన్ని అందించాలని ఈ సందర్భంగా ఎస్పీ కోరారు.

 

రిపోర్టర్ :  డేవిడ్ రాజు, విజయనగరం.