నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ : నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ స్వీకరణ శుక్రవారం నుంచి జరగనుంది. నగరపాలక సంస్థలో ఈసారి 72 డివిజన్లకు సంబంధించి అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. ఆయా ప్రాంతాల్లో నామినేషన్లు స్వీకరణ కార్యక్రమం జరగనుంది. ఈనెల 16 నుంచి 18వ తేదీ వరకు నామినేషన్ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమం ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎన్నికల అధికారులు ఆయా ప్రాంతాల్లో అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇప్పటికే నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి ఆ డివిజన్లకు సంబంధించిన తెలుగుదేశం, వైఎస్ఆర్సిపి, వివిధ పార్టీల అభ్యర్థులు వారికి సంబంధించిన వివరాలను, అదే విధంగా ఇంటి పన్ను బకాయిల కు సంబంధించి క్లియర్ చేసుకుంటున్నారు. అధికారుల నుంచి పోటీ చేసే అభ్యర్థులు నో డ్యూ క్లియరెన్స్ తీసుకుంటున్నారు. ఇప్పటికే నగరపాలక సంస్థలో అభ్యర్థుల రాకపోకలతో సందడి గా మారింది. మేయర్ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల సైతం ఎన్నికలకు సంబంధించి నామినేషన్లకు అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు.