నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలకు రూరల్ వైసీపీ సమరశంఖం నాయకులు, కార్యకర్తలకు ఆనం విజయకుమార్ రెడ్డి దిశానిర్దేశం
నెల్లూరు రూరల్ మేజర్ న్యూస్ : నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికలకు నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో సోమవారం నాడు ఆత్మీయ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పాత 26వ డివిజన్ నుంచి 41వ డివిజన్ వరకు ఉన్న నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని ఆనం విజయకుమార్ రెడ్డి సూచించారు.అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా శక్తివంచన లేకుండా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పలు డివిజన్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.