నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన-
టిడిపి యువనేత మన్నేపల్లి కార్తీక్:సిఎస్ పురం,మేజర్ న్యూస్: స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణసారధి, అపర భగీరథుడు, రాష్ట్ర అభివృద్ధి ప్రధాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం కొండేపి నియోజకవర్గ పరిధిలో జరుగుమిల్లి మండలం నర్సింగోలు గ్రామంలో జరగనున్న రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు మండలకేంద్రమైన సిఎస్ పురం పట్టణానికి చెందిన మండల టిడిపి యువనేత మన్నేపల్లి కార్తీక్ నాయుడు తెలిపారు. ఈసందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో టిడిపి జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం రైతుసంక్షేమం లక్ష్యంగా రైతులకు భూహక్కులు కల్పించి రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలు అందిస్తున్నట్లు అదేవిధంగా రాష్ట్రంలో అన్నివర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత కల్పించి అన్నిరంగాల్లో అభివృద్ధి చెందడానికి కూటమి ప్రభుత్వం కృషిచేస్తున్నట్లు రాష్ట్రాభివృద్ధి ప్రజాసంక్షేమం లక్ష్యంగా రాష్ట్రప్రజలకు సుపరిపాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వ రథసారథి,ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన గ్రామసభ కూటమి శ్రేణులు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని మన్నేపల్లి కార్తీక్ తెలిపారు.