BREAKING
పెళ్లి ప్రశ్నలపై నటి అంజలి తీవ్ర అసహనం.. ఆడంబరాలు నాకు అస్సలు ఇష్టం లేదు! సుడిగాలి సుధీర్ జీవోఏటీ మూవీ విడుదల తేదీ ఖరారు.. నవంబర్ 12న థియేటర్లలోకి! మహాత్మా గాంధీ జయంతి వేళ తెరపైకి వస్తున్న సరికొత్త బయోపిక్‌లు.. ప్రత్యేక ఆకర్షణగా మనోజ్ బాజ్‌పేయి, ప్రతీక్ గాంధీ! ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు వాల్‌‌స్ట్రీట్ కోలుకున్నప్పటికీ బాండ్ల అమ్మకాల ఒత్తిడి కొనసాగింపు ఆకట్టుకునే అమాయక ప్రేమకథగా తెల్ల కాగితం.. నిర్మాత దిల్‌ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు! విమానాశ్రయాల నుంచి ధారవి పునరాభివృద్ధి దాకా: బంగారం ప్రియులకు ఊరట.. హైదరాబాద్, విజయవాడలో తాజా పసిడి, వెండి మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు 17 నెలల గరిష్ట స్థాయికి డాలర్ విలువ, యూరోపై తీవ్ర ప్రభావం శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు ఉక్కు లేకుండా రక్షణ పరిశ్రమ అసాధ్యం: కెనడా ప్రభుత్వం స్పష్టీకరణ అమెరికాకు మకాం మార్పు, నాస్‌డాక్‌లో ప్రధాన లిస్టింగ్ దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ తీవ్ర హెచ్చరిక హిమాచల్ ప్రదేశ్‌లో రైతులకు తీపి కబురు: ఆపిల్ సేకరణ ధర పెంపు : సీఎం సుఖ్విందర్ సింగ్ సుక్కు ప్రకటన!

నేడు డా. ఆర్ఎస్ఎస్ కు మహాత్మా గాంధీ స్మారక విశిష్ట సేవా పురస్కారం

Select Suryaa Now
నేడు డా. ఆర్ఎస్ఎస్ కు  మహాత్మా గాంధీ స్మారక విశిష్ట సేవా పురస్కారం

రైతులు, నిరుపేదలు, దివ్యాంగుల సేవకు గుర్తింపుగా సత్కారం
. దివ్యాంగ విద్యార్థులకు మెరిట్ స్కాలర్‌షిప్‌లు
పులివెందులలో ఉదయం 10 గంటలకు అవార్డు ప్రదానోత్సవం

పామూరు, మేజర్ న్యూస్ : 
సంక్షేమం, నిరుపేదలు, అనాథలు, దివ్యాంగుల సేవే ధ్యేయంగా అహర్నిశలు సేవలందిస్తున్న స్వతంత్ర శాస్త్రవేత్త డా. ఆర్ఎస్ఎస్ (డా. రామిశెట్టి శివశంకర్) సేవలను గుర్తిస్తూ మహాత్మా గాంధీ స్మారక విశిష్ట సేవా పురస్కారాన్ని నేడు ప్రదానం చేయనున్నారు. ఏపీ దివ్యాంగుల నెట్‌వర్క్ ఆధ్వర్యంలో పులివెందులలోని పుల్లారెడ్డి ఆసుపత్రి సమీపంలోని దివ్యాంగుల కమ్యూనిటీ భవనంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. కార్యక్రమానికి మారుతి హాస్పిటల్‌కు చెందిన డా. ఎన్‌.చక్రపాణి, ఏపీ సీనియర్ జర్నలిస్ట్‌, రచయిత, ఆధ్యాత్మిక పరిశోధకుడు అల్లం రంగనాయకులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. డా. ఆర్ఎస్ఎస్ రీసెర్చ్ ఫౌండేషన్ సహకారంతో దివ్యాంగ విద్యార్థులకు ప్రతిభా ప్రోత్సాహకంగా మెరిట్ స్కాలర్‌షిప్‌లను సైతం పంపిణీ చేయనున్నారు. సేవా కార్యక్రమాలను ప్రోత్సహించడంతో పాటు దివ్యాంగ విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.