నరవ బయనపల్లెలో ఉరుసు మహోత్సవంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
గిద్దలూరు, మేజర్ న్యూస్ :
మండలంలోని నరవ బయనపల్లె గ్రామంలో ఆస్థానయే మాలిక్ పునఃప్రారంభం మరియు శ్రీ హజరత్ దస్తగిరి స్వాముల వారి ఉరుసు మహోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొన్నారు. కౌలూరి కాశన్న ఆహ్వానం మేరకు ఉరుసు మహోత్సవానికి హాజరై ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా నిర్వాహకులు, స్థానికులు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డిని ఆహ్వానించి శాలువా పూల మాలతో ఘనంగా సత్కరించారు. ఉరుసు మహోత్సవం సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.కార్యక్రమంలో మత పెద్దలు,గిద్దలూరు మండలం ప్రముఖులు, కూటమి నాయకులు, గ్రామస్తులు తదితరులు ఉరుసు మహోత్సవంలో పాల్గొన్నారు.