BREAKING
చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలి.. ప్రజాసేవలో ముందుండాలి సోనీ నుంచి సరికొత్త ఎఫ్‌ఎక్స్5 సినిమా కెమెరా ఇంద్రకీలాద్రిపై పవిత్ర వృక్షాల పెంపునకు శ్రీకారం నేటి పంచాంగం 10 నవంబర్, 2026 అమ్మవారి అన్నదానానికి రూ.2.50 లక్షల విరాళం నూతన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అభినందనలు అమరేశ్వర్‌కు రాష్ట్రస్థాయి అవార్డు దక్షిణ భారత పవర్‌లిఫ్టింగ్‌లో జోషితకు స్వర్ణం నేటి రాశి ఫలాలు 10 నవంబర్, 2026 మచిలీపట్నంలో ఈనెల 10న జాబ్‌మేళా ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులపై ప్రత్యేక దృష్టి : కలెక్టర్ డీకే బాలాజీ ఇద్దరు చిన్నారులను దత్తత తల్లిదండ్రులకు అప్పగించిన కలెక్టర్ హోంగార్డు కుటుంబానికి రూ.10.62 లక్షల బీమా ప్రజల నమ్మకానికి నిదర్శనం ఎన్నికల ఫలితాలు : మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్ ఎన్డీఏ కూటమికి ప్రజల అఖండ మద్దతు... - మరో 20 ఏళ్లు అధికారం మాదే... ఎంపీ కేశినేని చిన్ని

నగర పారిశుధ్యం, తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి

Select Suryaa Now
నగర పారిశుధ్యం, తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి

విజయవాడ కార్పొరేషన్ మేజర్ న్యూస్ : నగరంలో పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం వివిధ శాఖల అధిపతులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో పారిశుధ్యం, ఇంజనీరింగ్ పనులు, పచ్చదనం పెంపు, పన్నుల వసూళ్లు, పట్టణ ప్రణాళిక తదితర అంశాలపై సమీక్షించారు. భూగర్భ మురుగునీటి కాలువలు పొంగిపొర్లకుండా చర్యలు తీసుకోవాలని, రహదారులపై గుంతలను గుర్తించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్రతిరోజూ తాగునీటి నాణ్యత పరీక్షలు నిర్వహించి ప్రజలకు శుద్ధమైన నీరు అందేలా చూడాలన్నారు. ప్రజారోగ్య శాఖ అధికారులు చెత్తను ఎప్పటికప్పుడు సేకరించి ఎక్సెల్ ప్లాంట్‌కు తరలించాలని, వ్యర్థాల విభజన, వాటి ద్వారా సంపద తయారీ ప్రక్రియను పర్యవేక్షించాలని సూచించారు. చెత్త పేరుకుపోయే ప్రాంతాలను తరచూ తనిఖీ చేసి పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు ఇప్పటికే నాటిన మొక్కలకు క్రమం తప్పకుండా నీరు అందించి సంరక్షించాలని తెలిపారు. నగరపాలక సంస్థకు రావాల్సిన పన్నులను వేగంగా వసూలు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అనధికార నిర్మాణాలపై నిరంతర పర్యవేక్షణ చేపట్టి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రణాళిక అధికారులకు సూచించారు. శ్మశానవాటికల్లో మౌలిక సదుపాయాలు, పారిశుధ్య నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని కమిషనర్ స్పష్టం చేశారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.