BREAKING
వాతావరణ నిబంధనల సడలింపుతో ఆల్బెర్టాలో మళ్లీ పెరుగుతున్న గ్యాస్ ఫ్లేరింగ్ ఇందిరమ్మ బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం.. ఎస్ లింగం దిన్నె లో జనసేన ప్రచారం వ్యయ నియంత్రణపై ఫోక్స్‌వ్యాగన్, కార్మిక సంఘాల మధ్య ఉద్రిక్తత ఎస్ లింగం దిన్నె లో జనసేన ప్రచారం నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణలో కలెక్టర్ కృతికా శుక్లా పనితీరు భేష్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఎమ్మెల్యే మదన్ మోహన్  కలిసిన జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల కల్పన చంద్రశేఖర్ 2027 అంచనాలు పెంచినా లాభాల మార్జిన్ ఆందోళనలతో హెచ్‌పీఈ షేర్లు పతనం గ్యాస్ ఐరన్ బాక్సులు పంపిణీ అవకాశం ఇవ్వండి.. ఆదర్శంగా తీర్చిదిద్దుతా! వైకాపా సర్పంచి అభ్యర్థి రంగనాయకులు విజ్ఞప్తి స్పాటిఫై సేవల్లో తీవ్ర అంతరాయం ఏఐ గాడ్జెట్ అప్‌గ్రేడ్ జోరుతో బెస్ట్ బై వార్షిక అంచనాలు పెంపు రమణీయం… రథోత్సవం…గోవింద నామస్మరణతో మార్మోగిన నింబాచలం అమెరికా వాణిజ్య బ్లాక్‌లిస్ట్‌లో ఎన్‌విడియా కస్టమర్ మెగాస్పీడ్ లిబియా జలాల్లో రష్యా నౌకలపై దాడి ఆత్మరక్షణ చర్యే

నగర పాలక సంస్థ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన వేమిరెడ్డి దంపతులు

Select Suryaa Now
నగర పాలక సంస్థ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన వేమిరెడ్డి దంపతులు

 


నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్

నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి , కోవూరు శాసనసభ్యురాలు  వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి  సోమవారం నెల్లూరు నగర పాలక సంస్థ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. నూతన మేయర్‌  పోలుబోయిన రూప్‌కుమార్‌ యాదవ్‌ కి, డిప్యూటీ మేయర్‌  రఘునాథరాజు కి, 72 మంది నూతన కార్పొరేటర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు.  నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్‌గా  పోలుబోయిన రూప్‌కుమార్‌ యాదవ్‌  ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం కలెక్టర్‌  హిమాన్షు శుక్ల  72 మంది నూతన కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం బిజెపికి చెందిన  60 డివిజన్ కార్పొరేటర్  రఘునాథరాజు  డిప్యూటీ మేయర్‌గా ఏకగ్రీవంగా  ఎన్నికయ్యారు. ఈ
కార్యక్రమం అనంతరం  మంత్రి  పొంగూరు నారాయణ , ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రూరల్‌ ఎమ్మెల్యే  కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి , నూతన మేయర్‌  రూప్‌కుమార్‌ యాదవ్‌ తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి  మాట్లాడుతూ.. నెల్లూరు కార్పొరేషన్‌ మేయర్‌, 72 మంది కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావడం సంతోషంగా ఉందన్నారు. మేయర్‌ రూప్‌కుమార్‌ యాదవ్‌ కి, కార్పొరేటర్లందరికీ తాను ఇచ్చే సలహా ఒక్కటేనని, కార్పొరేషన్‌లో నిధులకు కొరత లేదని, ఆ నిధులను సరైన పనులకు సక్రమంగా వినియోగించాలని సూచించారు.

నగరంలోని అన్ని డివిజన్లలో అభివృద్ధి జరుగుతోందని, ఆ పనులను నాణ్యతతో సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మంత్రి నారాయణ  చెప్పినట్లు, ఆయా డివిజన్లలో మళ్లీ మీరే కార్పొరేటర్లు కావాలని స్థానికులు కోరుకునేలా పని చేయాలని పిలుపునిచ్చారు. మేయర్‌ రూప్‌కుమార్‌ యాదవ్‌ కి ఎంతో అనుభవం ఉందని, ఆయన కార్పొరేటర్‌గా పని చేసి, ఆ తర్వాత డిప్యూటీ మేయర్‌గా ఉండి, ఇప్పుడు మేయర్‌ అయ్యారని ఎంపీ  గుర్తు చేశారు. డిప్యూటీ మేయర్‌ రఘునాథరాజు  కూడా ఎంతో క్రమశిక్షణ ఉన్న వ్యక్తి అని, ఇద్దరు మంచి వ్యక్తులు మేయర్‌, డిప్యూటీ మేయర్‌ అయ్యారని అన్నారు. వారి మార్గదర్శకత్వంలో కార్పొరేటర్లందరూ పని చేయాలని, నెల్లూరు కార్పొరేషన్‌ను అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందామని ఎంపీ  తెలిపారు.