నార్పల లో, దుర్వాసన! పట్టించుకోని అధికారులు
నార్పల మండల కేంద్రంలో ప్రభుత్వం నిర్మించిన చెత్త సంపద తయారీ కేంద్రం నిర్లక్ష్యానికి నిలయంగా మారింది. కోట్ల నిధులతో నిర్మించిన ఈ కేంద్రం వినియోగంలోకి రాకపోవడంతో, గ్రామంలోని చెత్తను, జంతువుల కళేబరాలను ఆ ప్రాంగణంలోనే బహిరంగంగా పారవేస్తున్నారు. దీనివల్ల ఆ ప్రాంతమంతా తీవ్రమైన దుర్వాసన వెదజల్లుతోందని స్థానిక రైతులు, సమీప ఆశ్రమ నిర్వాహకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కూడబెట్టిన చెత్త మరియు కళేబరాల వల్ల ఈగలు, దోమలు విజృంభించి పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంపద తయారీ కేంద్రాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చి, చెత్తను ఎప్పటికప్పుడు నిర్మూలించాలని, బాధ్యులైన అధికారుల కలగజేసుకొని తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.