BREAKING
మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కార్మిక నాయకుడు రెడ్డి అప్పలనాయుడు కి ప్రజా సంఘాల మద్దతు కడియంలో జోరందుకున్న నామినేషన్ల పర్వం. డీఎస్పీ పర్యవేక్షణలో పటిష్ట పోలీసు బందోబస్తు నామినేషన్ల సందర్భంగా శాంతిభద్రతల సమస్య తలెత్తకూడదు కడియం ఎంపీపీ అభ్యర్థిగా రాజరాజేశ్వరి జక్కంపూడి రాజా సహా పార్టీ నేతల సంప్రదింపుల అనంతరం నిర్ణయం మెగా హీరోకు లైవ్‌లో ప్రపోజ్ చేసిన యాంకర్ శ్రీముఖి.. ఆయన ఇచ్చిన ఊహించని రిప్లై పి.గన్నవరం మండలంలో రెండో రోజు 33 నామినేషన్లు మల్లవరం పెదలంకలో దసరా నవరాత్రుల మహోత్సవాలు--మహిళల నృత్యాలతో అమ్మవారి ఊరేగింపు జిల్లాలో జడ్పీటీసీ అన్ని స్థానాలకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ... కూతుళ్లతో కలిసి బిగ్‌బాస్ నటి చైత్ర రాయ్ దసరా వేడుకలు.. సామాజిక మాధ్యమాలలో ఫొటోలు వైరల్ అనపర్తిలో 28 నామినేషన్లు దాఖలు..ఇప్పటివరకు 49 నామినేషన్లు దాఖలు: కామవరపుకోటలో 49 నామినేషన్లు పిల్లల్లో విపరీతంగా పెరుగుతున్న చదువు ఒత్తిడి.. తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి నేదునూరులో పెళ్లి బృందం వ్యాన్ బోల్తా30 మందికి గాయాలు.. పెదపుల్లేరు జనసేన ఎంపీటీసీ అభ్యర్థిగా పాటూరి మోహన్ ఉప్పలగుప్తం జనసేన జడ్పీటీసీ అభ్యర్థిగా ఆకుల లక్ష్మీ నరసాయమ్మ నామినేషన్..

నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

Select Suryaa Now
 నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

కొడవలూరు,  మేజర్ న్యూస్ :   గత వైసీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి  విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉందని, గతంలో ప్రతిపక్ష అభ్యర్థులకు ఆ అవకాశం లేకుండా చేసినవారు ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారని ఆరోపించారు. బుధవారం కొడవలూరు మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన నామినేషన్ల కార్యక్రమంలో ఎమ్మెల్యే  పాల్గొన్నారు. ఈ సందర్భంగా నార్త్‌ రాజుపాళెం–1 ఎంపీటీసీ స్థానానికి పోసింరెడ్డి మధురిమ, నార్త్‌ రాజుపాళెం–2 స్థానానికి పల్లా వెంకటేశ్వర్లు నామినేషన్లు దాఖలు చేశారు.

ఎన్నికల నిబంధనలు పాటించాలి    కూటమి తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు ఎన్నికల నిబంధనలకు లోబడి వ్యవహరించాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి  సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అధికారులకు సహకరించాలని పిలుపునిచ్చారు.

అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించండి   కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తోందని ఎమ్మెల్యే  తెలిపారు. అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ఇంటింటికీ వెళ్లి, గత రెండున్నరేళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును ప్రజలకు వివరించాలని కోరారు. గత పాలనకు, ప్రస్తుత పాలనకు మధ్య ఉన్న తేడాను చెప్పి ప్రజల మద్దతు కోరాలని పిలుపునిచ్చారు.