మురికి కూపంలో సింగనపల్లి..! గ్రామంలో తాండవిస్తున్న పారిశుధ్యం - అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ
మర్రిపాడు, మేజర్ న్యూస్ : అసలే దట్టమైన అటవీ ప్రాంతం. మండల కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో చిట్ట చివరి ప్రదేశంలో ఆ గ్రామం నెలకొని ఉంది. ఈ తరుణంలో అటు అధికారులు గానీ ఇటు పాలకులు గాని పట్టించుకోకపోవడంతో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండి దర్శనమిస్తోంది. కనీసం గ్రామాన్ని సందర్శించి వారి సమస్యలను పట్టించుకోవడం కరువైంది. ఫలితంగా గ్రామంలో పారిశుద్ధ్యం తాండవించి సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. అదే మర్రిపాడు మండలంలోని సింగనపల్లి గ్రామం. వివరాల్లోకి వెళ్తే...
జిల్లాలోని మర్రిపాడు మండలం సింగనపల్లి గ్రామం పారిశుద్ధ్యంతో తాండవిస్తోంది. దీంతో గ్రామంలోని ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. గ్రామంలో ఎటు చూసినా అంతర్గత రహదారులపై వృధా నీరు పారుతూ దర్శనమిస్తోంది. ఇక డ్రైనేజీ విషయానికి వస్తే కొన్నేళ్ల క్రితం ఏర్పాటు చేసిన కాలువల్లో కొన్నేళ్ల క్రితం ఏర్పాటు చేసిన కాలువల్లో పూడికతీత లేక మరుగుతో నిండి దోమలకు క్రిమి కీటకాలకు నిలయంగా మారింది. దీంతో పాటుగా గ్రామంలోని సిమెంట్ రహదారులపై బట్టలు ఉతికేసిన నీరును పోస్తుండడంతో మరింతగా పారిశుద్ధ్యం ఏర్పడి మురికి కూపంగా తయారవుతోందని గ్రామస్తులు పెదవి విరుస్తున్నారు. ఒక్కసారి ఎవరైనా ఆ గ్రామాన్ని సందర్శిస్తే పారిశుద్ధ్యన్ని చూసి ఆశ్చర్యపోక తప్పడం లేదు. ప్రస్తుత కాలంలో గ్రామాన్ని ఎంతో సుందరంగా తీర్చు దిద్దుకునే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సింగనపల్లి గ్రామం మాత్రం పారిశుద్ధ్యం తొలగించేందుకు కూడా ముందుకు రావడం లేదు. దీంతో ఆ గ్రామం మురికి కూపoలా తయారయింది. విశేషమేమిటంటే గ్రామంలోని నివాసాల వెంబడే పశువుల కొట్టాలు, పేడ దిబ్బలు ఉంటున్నాయి. దీంతో గ్రామంలో మరింతగా పారిశుద్ధ్యనికి కారణం అవుతోంది. నిత్యం సీజనల్ వ్యాధులు సోకి బద్వేలు, ఉదయగిరి, ఆత్మకూరు, నెల్లూరు ప్రాంతాలకు వెళ్లి చికిత్సలు చేయించుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని గ్రామస్తులు వాపోతున్నారు. అందువలన ఇప్పటికైనా సంబంధిత అధికారులు నాయకులు పాలకులు పట్టించుకోని గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు పారిశుద్ధ్యన్ని తొలగించి పశువుల కొట్టాలను పేడదిబ్బలను గ్రామానికి చివరలో చేసే విధంగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.