మున్సిపల్ ఎన్నికలపై టీడీపీ నాయకులతో ఎమ్మెల్యే సమావేశం..
మదనపల్లె: రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా టీడీపీ ఆశావహులు, నాయకులతో సమావేశం నిర్వహించారు.
మదనపల్లె టీడీపీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఎన్నికల అంశాలపై చర్చించారు.
పట్టణంలోని రాజకీయ పరిస్థితులను సమీక్షించారు.నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయంపై చర్చించారు.
మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన కార్యాచరణపై నాయకులతో ఎమ్మెల్యే సమాలోచనలు జరిపారు.
పి. గౌరి శంకర్, స్టాఫ్ రిపోర్టర్, తంబళ్లపల్లె