ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ భేటీ
సూర్య స్టేట్ బ్యూరో, అమరావతి :
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ గారు భేటీ అయ్యారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. తమ నివాసానికి వచ్చిన సీఎం విజయ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సాదరంగా ఆహ్వానించారు. సమావేశంలో మంత్రులు నారాయణ, నిమ్మల రామానాయుడు, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిలను సీఎం విజయ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు పరిచయం చేశారు.