మంత్రి సత్యకుమార్ ను మర్యాద పూర్వకంగా కలిసి నెల్లూరు మేయర్ రూప్ కుమార్.
నెల్లూరు సిటీ, మేజర్ న్యూస్ : ఇటీవల నెల్లూరు మేయర్గా భారీ మెజార్టీతో గెలుపొందిన రూప్ కుమార్ యాదవ్ మంగళవారం విజయవాడ లో మినిస్టర్స్ రెసిడెన్సీ నందు రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.. ఈ సందర్బంగా రూప్ కుమార్ నుమంత్రి సత్య కుమార్ యాదవ్ శాలువ కప్పి సన్మానించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన తోపాటు నెల్లూరు నగర 20వ డివిజన్ కార్పొరేటర్ గణేశం వెంకటేశ్వరరెడ్డి తదితరులు ఉన్నారు.