మండెల రాజకీయప్రవేశం
34 ఏళ్ల జర్నలిజానికి స్వస్తి.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి మండేల బాబి....
విజయదశమి వేళ జనసేనతో కొత్త ప్రస్థానం.. పవన్ కళ్యాణ్ ఆశయాల సాధనే లక్ష్యం.... అమలాపురమేజర్ న్యూస్ మూడు దశాబ్దాలకు పైగా పాత్రికేయ రంగంలో విశేష సేవలందించిన సీనియర్ జర్నలిస్ట్ మండేల బాబి (ఎం.ఎన్.వి. ప్రసాద్) ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. సుమారు 34 ఏళ్లపాటు ఈనాడు, ఆంధ్రప్రభ వంటి ప్రముఖ దినపత్రికల్లో రిపోర్టర్‌గా, స్టాఫ్ రిపోర్టర్‌గా, బ్యూరో బాధ్యతలు నిర్వహించిన ఆయన జర్నలిజం ప్రస్థానానికి స్వస్తి పలికి, విజయదశమి పర్వదినం సందర్భంగా జనసేన పార్టీ తరఫున రాజకీయ రంగంలోకి ప్రవేశిస్తున్నారు.సుదీర్ఘ పాత్రికేయ ప్రస్థానంలో మండేల బాబి వార్తా సేకరణ, ప్రజా సమస్యల వెలుగులోకి తేవడం, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం వంటి అంశాల్లో కీలక పాత్ర పోషించారు. గతంలో ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ ఐజేయూ సభ్యునిగా పనిచేసిన ఆయన, ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఏపీయూడబ్ల్యూజేఅధ్యక్షుడిగా, ఐజేయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో క్రెడాయ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు జర్నలిజంలో సుదీర్ఘ అనుభవాన్ని సంపాదించిన మండేల బాబి, జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారు. ప్రజా సమస్యలపై అవగాహన, క్షేత్రస్థాయిలో ప్రజలతో ఉన్న అనుబంధం తన రాజకీయ ప్రస్థానానికి తోడ్పడతాయనే ఆశాభావంతో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నారు.సుమారు 34 ఏళ్లపాటు పాత్రికేయుడిగా కొనసాగిన మండేల బాబి రాజకీయ రంగంలోకి ప్రవేశించడం ఆయన జీవితంలో కీలక మలుపుగా నిలవనుంది. విజయదశమి పర్వదినాన ప్రారంభమవుతున్న ఈ కొత్త ప్రయాణంలో ఆయన రాజకీయ రంగంలో మరింత బాధ్యతలు చేపట్టాలని, ప్రజా జీవితంలో ముందుకు సాగాలని సాటి పాత్రికేయుడిగా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.