BREAKING
బెల్లంకొండ శ్రీనివాస్ ‘హైందవ’ పవర్‌ఫుల్ టీజర్ రిలీజ్.. డివైన్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా సరికొత్త రికార్డులు! గొంతులో బాటిల్ మూత ఇరుక్కుని తొమ్మిది నెలల చిన్నారి మృతి ఆళ్లగడ్డలో ఎన్నికలు కోడ్ అమలు కదిరిబాబురావు కళాశాల విద్యార్థుల స్వచ్ఛభారత్ కాఫీ విత్ కరణ్ సీజన్ 9 గెస్ట్ లిస్ట్ లీక్.. అలియా భట్‌తో పాటు చివరి గెస్ట్‌గా బాద్షా షారుఖ్ ఖాన్! వడ్డీ రేట్ల హెచ్చుతగ్గులతో యూరోపియన్ బ్యాంకులకు కొత్త సవాళ్లు క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్ఐ వెంకటేశ్వరరెడ్డి: రెండుసార్లు ఐవీఆర్ఎస్ ద్వారా ఎన్నికైన మండల అధ్యక్షుడి మాటకు విలువ లేదా? పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు ఏది? నియోజకవర్గ ఇన్‌చార్జి తీరుపై మండల అధ్యక్షుడి ఆవేదన-రాష్ట్ర, జిల్లా నాయకత్వం ఇప్పటికైనా స్పందించేనా? హత్యకు గురైన ప్రకాశం కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి మాజీ ముఖ్యమంత్రి జగన్ హన్ రెడ్డిని కలిసిన ఒబేద్, రాజ్ పాల్ గిలీడ్ సైన్సెస్ మరియు విర్ బయోటెక్నాలజీ సంచలన ఒప్పందం సర్వే సమర్థవంతంగా, సకాలంలో పూర్తి చేయాలి - జేసీ కల్పనా కుమారి పెనుమూడి వద్ద 50 అడుగుల బుద్ధ విగ్రహాన్ని నెలకొల్పాలి నీట్‌లో మెరిసిన పామూరు ముద్దుబిడ్డ ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు

మంచినీళ్ల కోసం ఖాళి బిందెలతో రహదారిపై నిరసన

Select Suryaa Now
మంచినీళ్ల కోసం ఖాళి బిందెలతో రహదారిపై నిరసన

మంచినీళ్ల కోసం ఖాళీ బిందెలతో రహదారిపై నిరసన 
కనిగిరి ,మేజర్ న్యూస్ :మండలంలోని ఎన్‌.గొల్లపల్లి దళిత కాలనీలకు చెందిన సుమారు 100 కుటుంబాలకు మంచినీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ మంగళవారం సీఐటీయూ, కేవీపీఎస్‌, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్రజలు ఖాళీ బిందెలతో రోడ్డుపై నిరసన తెలిపారు. దీంతో కొంతసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.తమ కాలనీల గుండా సాగర్‌ పైప్‌లైన్‌ గ్రామంలోకి వెళ్తున్నప్పటికీ, తమకు కుళాయి కనెక్షన్లు ఇవ్వకపోవడంతో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారులకు విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు.ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకులు పి.సి. కేశవరావు మాట్లాడుతూ దళిత కాలనీల్లో కనీస మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి మంచినీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్‌ పి. నరేంద్ర, కాలనీవాసులు అబ్రహం, రోశయ్య, వెలుగొండయ్య, గురవయ్య, నాని, బాలరాజు, మనోహర్‌, ఎలిషమ్మ, ప్రమీల, చిన్న అచ్చమ్మ, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.