BREAKING
ఓం శక్తి అమ్మవారి విగ్రహ ప్రతిష్టకు విచ్చేయండి శిష్టకరణం నూతన కార్యవర్గం ఎన్నిక గౌడ సంఘాన్ని మరింత పటిష్టం చేస్తాం* వాలి చర్ల విద్యా కమిటీ చైర్మన్ గా రెండోసారి సయ్యద్ చిన కాసింవలి హోర్ముజ్ జలసంధి గుండా 20 లక్షల బ్యారెళ్ల ముడి చమురును రవాణా చేసిన ఇరాక్ 2021 ఫలితాలు పునరావృతం కావాలి. దివ్యాంగుల ఆత్మగౌరవానికి అండగా ఉంటాం స్థానిక ఎన్నికల సమరానికి బిజెపి శ్రేణులు సిద్ధంగా ఉండాలి మండల బిజెపి అధ్యక్షుడు యర్ర విక్రమ్ పిలుపు మొక్కలు నాటిన ఎంపీడీవో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను పేదలకు అందజేయాలి జల జీవన్ మిషన్ విజయానికి యారవ విస్తృత ప్రచారం స్థానిక సంస్థలు ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల పరిశీలన - సిఐ జయచంద్ర రాష్ట్ర టెన్నికాయిట్ పోటీలకు శ్రీకాకుళం జట్లు ఎంపిక పట్టణంలో వైఎస్ఆర్సిపి గుర్తింపు కార్డుల పంపిణీ సుపరిపాలనే పెట్టుబడిదారుల విశ్వాసానికి అసలైన పునాది

మిట్స్‌ యూనివర్సిటీకి అంతర్జాతీయస్థాయి గుర్తింపు

Select Suryaa Now
మిట్స్‌ యూనివర్సిటీకి అంతర్జాతీయస్థాయి గుర్తింపు


- టి.హెచ్.ఇ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్‌-2027లో చోటు
మదనపల్లె : మదనపల్లె సమీపంలోని (మదనపల్లె ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ  అండ్ సైన్స్) మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీకి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించిందని యూనివర్సిటీ ఫౌండర్ మరియు ఛాన్సలర్ డాక్టర్ ఎన్.విజయ భాస్కర్ చౌదరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాత టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టి.హెచ్.ఇ) తాజాగా ప్రకటించిన వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్-2027లో మిట్స్ 1401–1600 ర్యాంకింగ్ బ్యాండ్‌లో స్థానం సాధించిందని తెలిపారు.ప్రపంచవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల బోధన,పరిశోధన వాతావరణం,పరిశోధన నాణ్యత,పరిశ్రమతో అనుసంధానం,అంతర్జాతీయ దృక్పథం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్‌ను ప్రకటిస్తుందని తెలిపారు.మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీగా మారిన తొలి సంవత్సరంలోనే అంతర్జాతీయ స్థాయి ర్యాంకింగ్స్‌లో స్థానం సాధించడం సంస్థ విద్యా ప్రమాణాలు,పరిశోధన,పరిశ్రమ అనుసంధానం మరియు అంతర్జాతీయ దృక్పథానికి లభించిన గుర్తింపుగా ఆయన అన్నారు.ప్రపంచస్థాయి ర్యాంకింగ్స్‌లో మిట్స్‌కు లభించిన ఈ స్థానం సంస్థ భవిష్యత్ విద్యా,పరిశోధనా ప్రగతికి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుందని తెలిపారు.అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విద్యా,పరిశోధనా వాతావరణాన్ని మరింత బలోపేతం చేసి విద్యార్థులకు ప్రపంచస్థాయి అవకాశాలను అందించడమే మిట్స్ లక్ష్యమన్నారు.విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు పరిశోధన,పరిశ్రమ అనుసంధానం మరియు అంతర్జాతీయ అవకాశాలకు మరింత ప్రాధాన్యతనిస్తూ మిట్స్‌ను జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ విద్యాసంస్థగా తీర్చిదిద్దేందుకు మరింత ఉత్సాహంతో కృషి చేస్తామని డాక్టర్ ఎన్.విజయ భాస్కర్ చౌదరి తెలిపారు.ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్ ఎన్.ద్వారకానాథ్,ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల,వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి.యువరాజ్,రిజిస్ట్రార్ డాక్టర్ డి.ప్రదీప్ కుమార్,ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్,డైరెక్టర్-అడ్మిషన్స్ డాక్టర్ దీపాంకర్ రాయ్,అసిస్టెంట్ డీన్-అక్క్రిడిటేషన్స్ డాక్టర్ ఏ.వి పవన్ కుమార్  మరియు అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు.