BREAKING
నేటి రాశి ఫలాలు –4 నవంబర్, 2026 నేటి పంచాంగం4 నవంబర్, 2026 పదధ్వని బంతుల్లోనే అర్ధశతకం బాది చరిత్ర సృష్టించిన ప్రేమ రావత్: మహిళా క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు వంట నూనెను మళ్లీ మళ్లీ మరగబెట్టి వాడుతున్నారా: ఆరోగ్యానికి పొంచి ఉన్న తీవ్రమైన ప్రమాదాలు ఇవే జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్‌గా గెలుపొందిన శ్రీమతి నరేంద్రుల వినీత విజయోత్సవ ర్యాలీ క్యాప్సికమ్‌లో దాగున్న అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు: ఏ రంగు క్యాప్సికమ్ ఆరోగ్యానికి మరింత మంచిది ఇండియా పాక్ మ్యాచ్ క్రేజ్ మామూలుగా లేదుగా: వరల్డ్ కప్ మ్యాచ్ టికెట్ల కోసం కోట్లలో రిక్వెస్టులు భువనేశ్వర్ కుమార్ అంతర్జాతీయ కెప్టెన్సీ చాప్టర్ ముగిసినట్లే: సీనియర్ స్పిన్నర్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు రాగి పాత్రలో నీళ్లు తాగడం వల్ల శరీరానికి కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మరియు అసలు నిజాలు బ్రోకలీని సూపర్‌ఫుడ్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా: ఆరోగ్యానికి ఇది అందించే అద్భుత ప్రయోజనాలు ఇవే బిగ్‌బాస్ ఇంట్లో హీటెక్కిన 9వ వారం నామినేషన్లు: వంశీ వర్సెస్ ముకేష్ మధ్య తీవ్ర వాగ్వాదం పెళ్లి చూపులు సినిమాపై తరుణ్ భాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు: ఆ రొమాంటిక్ సీన్లపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ బాక్సాఫీస్ వద్ద జైలర్ 2 భారీ పతనం: రజనీకాంత్ చిత్రానికి బిగ్‌ షాక్.. వసూళ్లలో భారీ తగ్గుదల నకిరేకల్ పోలీస్ స్టేషన్‌లో సీజ్ చేసిన బైకులు మాయం? పోలీస్ శాఖలో కలకలం.. కానిస్టేబుల్ సైదులుపై తీవ్ర ఆరోపణలు! రోజూ వెజిటబుల్ సూప్ తాగితే శరీరానికి కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

మీ ఇంటి ఆడపడుచుగా ఆదరించి, ఆశీర్వదించి

Select Suryaa Now
మీ ఇంటి ఆడపడుచుగా ఆదరించి, ఆశీర్వదించి

నెల్లూరు,  మేజర్ న్యూస్ :    ఓట్లు వేసి నన్ను 21వ డివిజన్ కార్పొరేటర్‌గా గెలిపించిన ప్రజానీకానికి పేరుపేరునా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు.  నాపై నమ్మకంతో కార్పొరేటర్‌గా ప్రజాసేవ చేసే అవకాశం కల్పించిన జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ కి  ప్రత్యేక ధన్యవాదాలు.  నాకు అండగా నిలిచి, ప్రతి అడుగులో తోడుండి నడిపించిన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి, నెల్లూరు నగర శాసనసభ్యులు  శ్రీ పొంగూరు నారాయణ  కి , వారి కుటుంబ సభ్యులకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు, వీరమహిళలకు, జనసైనికులకు మరియు నా విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు.  మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని, ఇచ్చిన ఈ బాధ్యతను ప్రజాసేవకు అంకితం చేస్తాను. మన 21వ డివిజన్‌లోని ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ కార్యక్రమాల అమలు, అభివృద్ధి పనుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తాను.  మీకు ఏ సమస్య వచ్చినా, ఏ అవసరం ఉన్నా మీ ఇంటి ఆడపడుచుగా మీకు అందుబాటులో ఉంటూ, మీ ఇంటి ముంగిటకే వచ్చి సహాయం అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను.  పదవి నాకు అధికారం కాదు… ప్రజలకు సేవ చేసే బాధ్యత. మీ అందరి సహకారంతో మన డివిజన్‌ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని హామీ ఇస్తున్నాను.  మీ ఆశీస్సులు, ఆదరణ, సహకారం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.