మీ భూమి - మీ హక్కు - 4804 పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన...... ఎమ్మెల్యే ధూళిపాళ్ళ
మన కూటమి ప్రభుత్వం రైతులకు తోడుగా ,అండగా వుండే ప్రభుత్వం, ఇది ప్రజా ప్రభుత్వం పొన్నూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో పొన్నూరు మండలంలోని రీ సర్వే పూర్తి అయ్యి ప్రింట్ చేయబడిన 7 గ్రామాలకు చెందిన లబ్ధిదారులకి 4804 పట్టాదారు పాసు పుస్తకాలను పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని పంపిణీ చేసారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మీ భూమి - మీ హక్కు" రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చెయ్యటం జరిగింది గత వైకాపా ప్రభుత్వ కాలంలోని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేసి, రాజకీయ నాయకుల ఫోటోలకు బదులు ప్రభుత్వ రాజ ముద్రతో కూడిన పుస్తకాలను లబ్ధిదారులకు పంపిణీ చెయ్యటం జరిగిందన్నారు ఈ పాస్ పుస్తకాల్లో 13 రకాల భద్రతా ఫీచర్లు, క్యూఆర్ కోడ్ ఉంటాయి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే రైతు పేరు, తండ్రి పేరు, సర్వే నంబర్, విస్తీర్ణం, భూమి మ్యాప్ వంటి వివరాలు వెంటనే తెలుస్తాయి. నకిలీలు, ట్యాంపరింగ్ జరగకుండా హై-సెక్యూరిటీ కల్పించటం కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు నేడు మన పొన్నూరు మండలంలోని దొప్పలపూడి - 362 ఆరెమండ - 777 ఉప్పరపాలెం -1320 జూపూడి -615 జడవల్లి - 430,వడ్డెముక్కల -393,
వెల్లలూరు - 907 గ్రామాలకు సంబంధించిన రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకములు పంపిణీ చెయ్యటం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమాల్లో మండల తాసిల్దార్ మహమ్మద్ జియవుల్ హక్ , కమిషనర్ ముప్పాళ్ళ రమేష్ బాబు సంబధిత గ్రామాల రైతులు, నాయకులు, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
పొన్నూరు నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్ :- శిలార్