BREAKING
నేటి పంచాంగం 13నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు 13 నవంబర్, 2026 వివాహ వేడుకకు రంగం సిద్ధం.. కొత్త జీవితంపై రిమి టోమి కాబోయే భర్త మాథ్యూ ఆసక్తికర పోస్ట్ మీర్జాపూర్ విజయపు ఒత్తిడిని అసలు తీసుకోను.. నటి శ్వేతా త్రిపాఠి ఆసక్తికర వ్యాఖ్యలు క్యాన్సర్ ముప్పును దూరం చేసే అద్భుతమైన ఆరోగ్య అలవాట్లు.. నిపుణులు ఏం చెబుతున్నారు? న్యూజిలాండ్ గడ్డపై భారత ఫుట్‌బాల్ జట్టుకు ఘోర పరాభవం.. తొలి ఫ్రెండ్లీ మ్యాచ్‌లో కివీస్ జయభేరి దర్శకుడిగా మారిన రవి మోహన్.. యోగి బాబు హీరోగా 'ఆన్ ఆర్డినరీ మన్' నుంచి కొత్త సాంగ్ రిలీజ్ దిగ్గజ నటుడు పద్మశ్రీ మధుకు అరుదైన గౌరవం.. ప్రథమ బిచ్చు తిరుమల పురస్కారం ప్రకటన భోజనం చేస్తూ స్మార్ట్‌ఫోన్ వాడే అలవాటు ఉందా.. అయితే ఈ తీవ్రమైన అనారోగ్య సమస్యలు తప్పవు 'పరిషత్' పీఠాలపై పరోక్ష పోరు! అభాగ్యులకు అండగా సేవా సంస్థలు! పుస్తకాలు చదవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాలు ఇవే ప్రశాంత ఎన్నికలకు సహకరించండి... డిఎస్పి రాఘవులు వైకాపా నుండి తెదేపాలో చేరిన 50 కుటుంబాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా.. రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ నియంత్రణతో ముప్పుకు చెక్

మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి

Select Suryaa Now
మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి

 

  

డి ఆర్ ఓ మోహన్ కుమార్

 

చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్: మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని డి ఆర్ ఓ మోహన్ కుమార్ తెలిపారు. బుధవారం చిత్తూరు కలెక్టరేట్‌ లోని వివేకానంద భవన్ లో గొప్ప విద్యావేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు, భారతదేశ తొలి కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని జిల్లా మైనారిటీల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జాతీయ విద్యా దినోత్సవ వేడుకలను ఘనంగానిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిఆర్ఓ ముఖ్యఅతిథిగా పాల్గొని మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గొప్ప పండితుడని, స్వాతంత్ర్య సమరంలో మహాత్మా గాంధీతో కలిసి కీలక పాత్ర పోషించారని తెలిపారు. దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా విద్యారంగ అభివృద్ధికి విశేష కృషి చేశారని, ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల ఏర్పాటుకు పునాదులు వేశారని పేర్కొన్నారు. మహిళా విద్యతో పాటు ప్రతి ఒక్కరికీ విద్య అందాలని, విద్య ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమని ఆయన బలంగా విశ్వసించారని తెలిపారు. ఆయన రచించిన ఇండియా విన్స్ ఫ్రీడమ్ వంటి గ్రంథాలు ఎంతో విలువైనవని పేర్కొంటూ, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ, కలెక్టరేట్ సిబ్బంది వివిధ శాఖల సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

ఉమాశంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.