BREAKING
పశ్చిమ బెంగాల్ ఉపఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయం తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుంటానా? స్పందించిన ది రాజాసాబ్ హీరోయిన్ నిధి అగర్వాల్ సైబర్ మోసాలకు కేంద్రం చెక్ :కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి! నకరికల్లులో వైసీపీ కార్యకర్తలకు ఐడి కార్డులు పంపిణీ ఆర్టీసీ ఎన్నికల్లో దూసుకుపోయిన బాణం నారాయణపేట డిపోలో కూటమికి మెజార్టీ రాత్రిపూట ఎలాంటి ఆహారం తీసుకోవాలి? జీర్ణక్రియ సజావుగా సాగేలా పాటించాల్సిన ఆరోగ్యకరమైన చిట్కాలు హోప్ శతకం, రూథర్‌ఫోర్డ్ విధ్వంసం – 249 పరుగులు చేసినా భారత్‌కు తప్పని ఓటమి మానసిక ప్రశాంతత కోసం రోజువారీ జీవితంలో పాటించాల్సిన సులువైన మార్పులు ఇవే నిగనిగలాడే అందమైన చర్మం కోసం ఆహారపు అలవాట్లు మరియు నిద్ర విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారా? ఈ ప్రమాదకర అలవాటు వల్ల కలిగే అనర్థాలు ఇవే సాధారణ ర్యాలీలకు తెర.. ఫలితాల ఆధారంగానే భారత మార్కెట్లలో అవకాశాలు.. రజనీకాంత్ జైలర్ 2 కోసం క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా వేసుకున్న నెల్సన్.. అసలు నిజం బయటపెట్టిన సూపర్ స్టార్ బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్: రోజువారీ సీఆర్‌ఆర్ నిర్వహణ నిబంధన 99 శాతానికి పెంపు.. అక్టోబర్ 16 నుంచే అమలు! భారత్ గుండెల్లో ఆఫ్రికా: విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టీకరణ! ఘనంగా ఫ్యూచర్ సిటీ రియల్ ఎస్టేట్ మండల అధ్యక్షుడి జన్మదిన వేడుకలు

మహిళలు చట్టపరమైన హక్కులపై అవగాహన పెంచుకోవాలి హక్కులతో పాటు బాధ్యతలనూ గుర్తెరగాలి తణుకు కోర్టు ప్రాంగణంలో న్యాయవిజ్ఞాన సదస్సు

Select Suryaa Now
మహిళలు చట్టపరమైన హక్కులపై అవగాహన పెంచుకోవాలి  హక్కులతో పాటు బాధ్యతలనూ గుర్తెరగాలి  తణుకు కోర్టు ప్రాంగణంలో న్యాయవిజ్ఞాన సదస్సు

తణుకు, సూర్య న్యూస్ :మహిళలు తమకు చట్టం కల్పించిన హక్కులపై అవగాహన పెంచుకోవడంతో పాటు వాటిని బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని న్యాయమూర్తులు సూచించారు. గురువారం తణుకు కోర్టు భవనాల సముదాయంలో నాలుగో అదనపు జిల్లా జడ్జి, మండల న్యాయసేవల సంస్థ చైర్‌పర్సన్ సుంకర శ్రీదేవి ఆదేశాల మేరకు సీనియర్ సివిల్ జడ్జి కె.కృష్ణ సత్యలత ఆధ్వర్యంలో వరకట్న నిషేధం, మహిళా హక్కులపై న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ వరకట్న వేధింపులు, ఉద్యోగ ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొనే సమస్యలు, వాటి పరిష్కారానికి అందుబాటులో ఉన్న చట్టపరమైన మార్గాలను వివరించారు. ఆడపిల్లల పట్ల వివక్ష చూపకుండా విద్యలో సమాన అవకాశాలు కల్పించాలని సూచించారు. మహిళలు తమ హక్కులను సద్వినియోగం చేసుకోవాలే తప్ప దుర్వినియోగం చేయరాదన్నారు. న్యాయపరమైన సమస్యలు ఎదురైనప్పుడు మండల న్యాయసేవల సంస్థ ద్వారా ఉచిత న్యాయసహాయం, న్యాయసలహాలు పొందవచ్చని తెలిపారు.కార్యక్రమంలో మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి.స్వర్ణ, రెండో అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కె.కృష్ణవేణి, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఐడీఎల్ కిరణ్మయి, మహిళా న్యాయవాదులు, అంగన్వాడీ టీచర్లు, పారా లీగల్ వాలంటీర్లు, కౌర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

 రిపోర్టర్ అని కుమార్ తణుకు పశ్చిమగోదావరి జిల్లా