మహిళలపై దాడులను అడ్డుకుంటాం
బాడంగి, సెప్టెంబర్ 28 (మేజర్ న్యూస్): మహిళలపై జరుగుతున్న దాడులు, వేధింపులకు వ్యతిరేకంగా భగత్‌సింగ్ స్ఫూర్తితో పోరాటాలు కొనసాగిస్తామని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు కే. పుణ్యవతి అన్నారు. పి.గదబవలసలో సోమవారం భగత్‌సింగ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహిళల రక్షణకు చట్టాలు ఉన్నప్పటికీ వాటి అమలులో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని, గ్రామాల్లో బెల్ట్‌షాపులను అరికట్టాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించకపోతే ఐద్వా ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పలువురు మహిళలు పాల్గొన్నారు.