BREAKING
ఫ్రెంచ్ నటుడు జెరార్డ్ డిపార్డియూపై అత్యాచార కేసు విచారణకు పారిస్ కోర్టు ఆమోదం బ్రిటిష్ పౌండ్ స్థిరత్వం.. అమెరికా డాలర్ ర్యాలీకి బ్రేక్ స్విట్జర్లాండ్‌లో ఐదు సైబర్ దాడులలో ఏఐ ఏజెంట్ల వినియోగం ఫిఫాపై సైబర్ దాడి ఇరాన్ యుద్ధం, ఇంధన ధరల షాక్.. ఆర్థిక సంక్షోభంలో విమానయాన సంస్థలు ఫుడ్ సేఫ్టీ పై అవగాహన కార్యక్రమాలు" రాజ్యాంగ దినోత్సవ వేడుకలు " టెక్సాస్ జడ్జి నామినేషన్‌లో ట్రంప్ కీలక మార్పు పిరాట్లంక అభివృద్ధే కూటమి లక్ష్యం గ్రామ ప్రగతికి కూటమి అభ్యర్థులను గెలిపించాలి: కమతం సాంబశివరావు సమాజంలో ప్రతి పౌరుడు భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి ప్రజాస్వామ్య పరిరక్షణలో పౌరుల పాత్ర కీలకం ఆర్డీఓ బి. శ్రీదేవి రబీ సీజన్‌లో అర్హులైన రైతులందరూ గడువులోగా పంటల బీమా నమోదు చేసుకోవాలి* *డిసెంబర్ మొదటి వారం లోపు నమోదు ప్రక్రియ పూర్తి చేయాలి* *క్రాప్ ఇన్సూరెన్స్ యాప్ ద్వారా ఇంటి నుంచే ఉచితంగా నమోదు చేసుకునే అవకాశం* *ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి* గుడివాడ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఆర్డీవోలు పోలీస్ బడిలోని 42/2 పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన జి. బాలసుబ్రహ్మణ్యం, బి. శ్రీదేవి కృష్ణా జలాల విషయంలో పొరపాటు జరిగింది.. రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ పీఠిక పఠనం.. ఘనంగా రాజ్యాంగ ఆమోద దినోత్సవం

మహిళా విద్యార్థుల భద్రతకు పటిష్టమైన చర్యలు

Select Suryaa Now
మహిళా విద్యార్థుల భద్రతకు పటిష్టమైన చర్యలు

నగరం, మేజర్ న్యూస్: మహిళా విద్యార్థుల భద్రత, ఆత్మవిశ్వాసం, సురక్షిత విద్యా వాతావరణం కల్పించడమే లక్ష్యంగా స్థానిక శ్రీ వెలగపూడి రామకృష్ణ స్మారక కళాశాల మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అనగాని హరి కృష్ణ మాట్లాడుతూ, మహిళా విద్యార్థుల భద్రత కళాశాల యాజమాన్యానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని, విద్యార్థినులు తమ వ్యక్తిగత భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి వేధింపులు, అసౌకర్యాలు, భద్రతాపరమైన సమస్యలు ఎదురైనా భయపడకుండా వెంటనే కళాశాల అధికారులకు తెలియజేయాలని సూచించారు. మహిళా విద్యార్థుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కళాశాలలో ప్రత్యేక భద్రతా కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు, సేఫ్టీ ఆఫీసర్‌గా ఏ. కోకిల ను నియమించామన్నారు. విద్యార్థినులకు అత్యవసర సమయాల్లో తక్షణ సహాయం అందించేందుకు కళాశాల ప్రిన్సిపల్, సేఫ్టీ ఆఫీసర్ ఫోన్ నంబర్లను కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమాచార బోర్డుపై ప్రదర్శించారు. విద్యార్థినులు ఏవైనా సమస్యలు లేదా ఇబ్బందులు ఎదురైనప్పుడు సంబంధిత అధికారులను తక్షణమే సంప్రదించాలని, వారి భద్రత, గౌరవం, సంక్షేమ పరిరక్షణకు కళాశాల యాజమాన్యం నిరంతరం అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో మహిళా సాధికారత విభాగం సభ్యులు, భద్రతా కమిటీ సభ్యులు  ఆర్. ప్రసన్న బాబు, ఏ. శ్రీదేవి, పి. రాజ్యలక్ష్మి, జి. రత్నశ్రీ, అధ్యాపకులు, మహిళా విద్యార్థులు పాల్గొన్నారు.